అద్భుత ఫీచర్లతో వివో వై95, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

26 Nov, 2018 11:47 IST|Sakshi

పేటీఎం ద్వారా రూ.1500 క్యాష్‌బ్యాక్‌

జియో ద్వారా రూ.4వేలు ఆఫర్‌, 3టీబీ డేటా ఫ్రీ 

ధర రూ.16,990

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ దిగ్గజం వివో తాజాగా నూతన స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. 'వివో వై95' పేరుతో మిడ్‌ రేంజ్‌ ఫోన్‌ను భారతీయమార్కెట్లో లాంచ్‌ చేసింది.వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, డ్యూయెల్ కెమెరాలు ప్రధాన  ఫీచర్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ధర రూ.16,990 గా నిర్ణయించింది. స్టారీ నైట్‌, నెబులా పర్పుల్ కలర్లలో లభించే ఈ ఫోన్ ఆఫ్‌లైన్ స్టోర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం, వివో ఇండియా ఇ-స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులోకి ఉంది.  ముఖ్యంగా పేటీఎం ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.1,500 క్యాష్ బ్యాక్ లభించనుంది. అలాగే, జియో వినియోగదారులు  రూ.4వేల, 3టీబీ డేటా ఉచితం లాంటి ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.

వివో వై95 ఫీచర్లు
6.2" హెచ్‌డీ డిస్‌ప్లే 
1520 x 720 పిక్సల్స్ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 
స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
13/2 మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు
20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్
4030 ఎంఏహెచ్ బ్యాటరీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా