దలాల్‌ స్ట్రీట్‌లో టెలికాం షేర్ల లాభాల రింగింగ్‌

19 Nov, 2019 11:09 IST|Sakshi

సాక్షి, ముంబై: భారీ నష్టాలతో కుదేలైన భారత టెలికాం కంపెనీలకు ఏజీఆర్‌ చార్జీలు వడ్డన లాంటి తాజా పరిణామాల నేపథ్యంలో టారిఫ్‌లను సమీక్షించుకుంటున్నాయి. టెలికాం దిగ్గజ కంపెనీలైనా వొడాఫోన్‌-ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ డిసెంబర్‌ 1 నుంచి కాల్‌చార్జీలను పెంచాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయంతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా షేర్లు మంగళవారం సెషన్‌లో 52 వారాలా గరిష్టాన్ని తాకి జోరుగా సాగుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌  5 శాతం లాభంతో కొనసాగుతోంది.  

గత మూడు రోజుల్లో ఎయిర్‌టెల్‌ షేరు 20 శాతం ఎగిసింది. వొడాఫోన్‌-ఐడియా షేర్లు కూడా ఇదే బాటలో మంగళవారం సెషన్‌లో ర్యాలీ చేస్తున్నాయి. 25 శాతం లాభంతో కొనసాగుతోంది. కాగా మూడు సెషన్లుగా 80 శాతం లాభపడింది. దీంతో బ్రోకరేజ్‌ సంస్థలు ‘హోల్డ్‌’కు రేటింగ్‌ను ఇస్తున్నారు. మోర్గాన్ స్టాన్లీ భారతి ఎయిర్‌టెల్ టార్గెట్ ధరను అంతకుముందు 360 రూపాయల నుండి రూ. 410కు పెంచింది.  కాగా క్యూ 2 లో భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన​ ఐడియా రెండూ అత్యధిక త్రైమాసిక నష్టాన్ని నివేదించాయి. వొడాఫోన్ ఐడియా క్యూ 2లో రూ.50921 కోట్ల నికర నష్టాన్ని, భారతి ఎయిర్‌టెల్ త్రైమాసిక నష్టం రూ. 28,450 కోట్లు నమోదుచేసిన సంగతి  తెలిసిందే.

మరిన్ని వార్తలు