వోడాఫోన్‌ ఐడియానా, జియోనా కింగ్‌ ఎవరు?

19 Sep, 2019 16:31 IST|Sakshi

సాక్షి, ముంబై : భారతీయ టెలికాం  పరిశ్రమలో వోడాఫోన్‌  ఐడియా అతిపెద్ద కంపెనీగా అవతరించింది.  380కి పైగా చందాదారులతో వోడాపోన్‌ ఐడియా  ఈ ఘనతను సాధించింది. జులై మాసానికి సంబంధించి గణాంకాలను  టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తాజాగా విడుదల చేసింది. 38 కోట్ల మంది సభ్యులతో వొడాఫోన్ ఐడియా దిగ్గజం కంపెనీగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.  కాగా రిలయన్స్‌ జియో  33.98 కోట్ల వినియోగదారులతో రెండవ స్థానంలోనూ, 32.85 కోట్ల మంది వినియోగదారులతో ఎయిర్‌టెల్ తొలి మూడవ స్థానంలోనూ నిలిచాయి.  దీంతో ఇవాల్టి బేర్‌ మార్కెట్‌లో  కూడా వోడాఫోన్‌ ఇండియా కౌంటర్‌ ఏకంగా 16శాతం ఎగియడం  విశేషం. 

జూలై చివరి నాటికి మొత్తం వైర్‌లెస్ చందాదారుల సంఖ్య 1,168.3 మిలియన్లకు పెరిగిందని  ట్రాయ్‌ తెలిపింది. జూలై 31, 2019 నాటికి, ప్రైవేట్ యాక్సెస్సర్వీస్ ప్రొవైడర్లు వైర్‌లెస్ చందాదారుల మార్కెట్ వాటాను 89.73 శాతం కలిగి ఉండగా, ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌,  ఎమ్‌టిఎన్ఎల్ మార్కెట్ వాటాను కేవలం 10.27 శాతం మాత్రమే కలిగి  ఉన్నాయని ట్రాయ్ తన నివేదికలో రాసింది. అలాగే జూన్ చివరి నుంచి జూలై చివరి నాటికి అన్ని కంపెనీలు చందారులను కోల్పోతుండగా,  వోడాఫోన్‌ ఐడియాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. గత కొన్ని నెలలుగా ఇదే ధోరణి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  మొత్తం క్రియాశీల చందాదారుల విషయానికొస్తే  ఎయిర్‌టెల్ టాప్‌లో ఉంది.  94.95 శాతం  చందాదారులు  యాక్టివ్‌గా ఉన్నారు.  ఆ తరువాత జియో 83.07 శాతం, వోడాఫోన్ ఐడియా 81.9 శాతంతో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు