రూ.7- 8 మధ్యన వొడాఐడియా ర్యాలీకి బ్రేక్‌?!

29 May, 2020 13:21 IST|Sakshi

ఆప్షన్‌ డేటా విశ్లేషణ

కంపెనీలో గూగుల్‌ వాటాలు కొనేందుకు సిద్ధంగా ఉందన్న వార్తలు వొడాఫోన్‌ ఐడియా షేరులో ఉత్సాహం నింపాయి. దీంతో శుక్రవారం ఒక్కరోజులో షేరు దాదాపు 30 శాతం దూసుకుపోయింది. మధ్యాహ్న సమయానికి రూ. రూ.7.35 వద్ద(దాదాపు 27 శాతం అప్‌) కదలాడుతోంది. ఈ నేపథ్యంలో షేరులో మరింత అప్‌మూవ్‌ ఉంటుందా? కన్సాలిడేషన్‌ జరుగుతుందా? అనే విషయమై సామాన్య మదుపరి ఆసక్తిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా షేరు ఆప్షన్స్‌పై ఎఫ్‌అండ్‌ఓ నిపుణులు విశ్లేషణ జరిపారు. ఆప్షన్‌ డేటా ప్రకారం ఈ షేరు స్వల్పకాలానికి రూ. 6-8 మధ్య కదలాడే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. 
షేరు ఆప్షన్‌ డేటా విశ్లేషణ ఇలా ఉంది....

  •  ఐడియా ఆప్షన్స్‌ పరిశీలిస్తే అత్యధికంగా రూ. 10, 7, 6, 8 స్ట్రైక్‌ప్రైస్‌ల వద్ద కాల్స్‌ ఉన్నాయని, రూ. 6, 5, 7 వద్ద పుట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. 
  •  శుక్రవారం రూ. 10, 8 స్ట్రైక్‌ప్రైస్‌ వద్ద ఎక్కువగా కాల్‌రైటింగ్‌ జరగగా, రూ. 6, 7 వద్ద ఎక్కువగా పుట్‌ రైటింగ్‌ జరిగింది.
  •  కాల్‌ రైటింగ్‌ జరిగే ధరలు తక్షణ నిరోధాలుగా, పుట్‌ రైటింగ్‌ జరిగే ధరలు తక్షణ మద్దతులుగా నిలుస్తుంటాయి. 
  •  ఈ ప్రకారం చూస్తే వొడాఐడియా షేరుకు తక్షణం రూ. 8 వద్ద నిరోధం, రూ. 6. వద్ద మద్దతు కనిపిస్తున్నాయి. 
  •  అందువల్ల స్వల్పకాలానికి షేరు రూ. 7 వద్దనే అటు ఇటు కదలాడే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని నిపుణుల అంచనా. రూ. 8 వద్దకు వచ్చినప్పుడు అమ్మకాలు, రూ. 6కు వస్తే కొనుగోళ్లు జరగవచ్చు.
  •  ఒకవేళ అనూహ్యంగా షేరు రూ. 7పైన స్థిరపడి క్రమంగా రూ. 8 దాటగలిగితే క్రమంగా రూ. 10కి చేరే అవకాశాలున్నాయి. అలాగే దిగువన రూ. 5 వద్ద మరో గట్టి మద్దతుంది.  
  •  షేరు పీసీఆర్‌ నిష్పత్తి ప్రస్తుతం దాదాపు 0.5గా ఉంది. ఇది కూడా ఒక రకంగా ర్యాలీని పరిమితం చేసే సంకేతంగా భావించవచ్చు. 
>
మరిన్ని వార్తలు