ప్రత్యర్థులకు పోటీగా వోడాఫోన్‌ ఐడియా కొత్త ప్లాన్స్‌

9 Feb, 2019 11:57 IST|Sakshi

వోడాఫోన్‌ ఐడియా కొత్త  మ్యూజిక్‌ యాప్‌

సావన్‌, వింక్‌ మ్యూజిక్‌  యాప్‌లకు కౌంటర్‌ 

ఐడియా మ్యూజిక్‌ యాప్‌ తొలగింపు

బెస్ట్‌ ఇన్ క్లాస్‌ ఫీచర్లతో  కొత్త మ్యూజిక్‌ యాప్‌

సాక్షి,ముంబై : ప్రముఖ  టెలికాం సంస్థ వోడాఫోన్‌  ఐడియా  తన ప్రత్యర్థులకు షాకిచ్చేలా  కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టెలికాం సంచలనం రిలయన్స్‌ జియోకు గట్టి పోటీ ఇచ్చేలా వొడాఫోన్‌ ఐడియా కూడా సొంత మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. తన కస్టమర్లకు మ్యూజిక్‌ సర్వీసుల ద్వారా మరింత దగ్గరయ్యే ప్రణాళికలో భాగంగా కొత్త మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ యూప్‌ను ప్రవేశపెట్టనుంది.  మార్కెట్‌ పోటీకి అనుగుణంగా అత్యుత్తమ ఫీచర్లతో ఈ యాప్‌ ఉండాలని వొడాఫోన్‌ ఐడియా సంస్థ భావిస్తోందట.
 
ఐడియా మ్యూజిక్‌ యాప్‌ను తొలగించిన దాని స్థానంలో పటిష్ఠమైన యాప్‌ తీసుకురానుందని తాజా నివేదికల ద్వారా  తెలుస్తోంది. దీనికి సంబంధించిన తుది చర్యల్లో ఉన్నామని వోడాఫోన్‌ ఐడియా సీఈవో బాలేశ్‌శర్మ  వ్యాఖ్యలను ఉటంకిస్తూ లైవ్‌మింట్‌ రిపోర్ట్‌ చేసింది. 

కాగా మ్యూజిక్‌ ప్రియుల కోసం మ్యూజిక్‌ స్ల్రీమింగ్‌ ఫ్లాట్‌ ఫామ్‌ జియో సావన్‌ను రిలయన్స్‌ జియో ఇటీవల  ఆవిష్కరించిన తెలిసిందే. అలాగే 100మిలియన్ల యూజర్లతో భారతీ ఎయిర్‌టెల్‌కుచెందిన వింక్‌ మ్యూజిక్‌యాప్‌ద్వారా  ఇప్పటికే తన  సేవలను అందిస్తోంది. మరోవైపు  ప్రస్తుతం ఐడియా మ్యూజిక్‌ యాప్‌లో 3మిలియన్ల పాటలున్నట్టు గణాంకాల ద్వార తెలుస్తోంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా