చెల్లింపుల జోష్ : వొడాఫోన్ ఐడియా జంప్

23 Apr, 2020 12:36 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా గురువారం నాటి మార్కెట్లో దూసుకుపోతోంది. ఇవాళ ఇంట్రాడేలో షేర్‌ 15 శాతం లాభపడింది.  ప్రధానంగా వొడాఫోన్ ఐడియాతో 200 మిలియన్ డాలర్ల చెల్లింపును వేగవంతం చేసినట్లు వోడాఫోన్ గ్రూప్ ప్రకటించింది. తమ సంస్థ కార్యకలాపాలను నిర్వహించేందుకు లిక్విడిటీని అందించినట్టు ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. దీంతో వరుసగా రెండో సెషన్‌లోనూ వొడాఫోన్‌ ఐడియాలో లాభాల జోరు కొనసాగుతోంది. (కరోనా కల్లోలం : జీడీపీపై ఫిచ్ షాకింగ్ అంచనాలు)

ఆదిత్య బిర్లా గ్రూపుతో భారతీయ జాయింట్ వెంచర్‌లో 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5 1,530 కోట్లు) చెల్లింపులను చేయనున్నట్టు బ్రిటిష్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ పీఎల్ సీ వెల్లడించింది. వొడాఫోన్ ఐడియా తన కార్యకలాపాలను నిర్వహించడానికి ద్రవ్య లభ్యతకోసం ఈ చెల్లింపును వేగవంతం చేసినట్టు వొడాఫోన్ గ్రూప్, ఒక ప్రకటనలో  తెలిపింది. నిబంధనల ప్రకారం ఈ చెల్లింపులు 2020 సెప్టెంబరులో జరగాల్సి ఉందని తెలిపింది. తద్వారా వొడాఫోన్ ఐడియా కస్టమర్లు, వేలాది మంది వొడాఫోన్ ఐడియా ఉద్యోగులు మొత్తం సుమారు 300 మిలియన్ల మంది భారతీయ పౌరులకు తమ మద్దతు లభించనుందని పేర్కొంది.  కోవిడ్-19  సంక్షోభ సమయంలో తీసుకున్న అత్యవసర  చర్యగా  వెల్లడించింది.  కాగా తాజా లాభాలతో వొడాఫోన్‌ ఐడియా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.11,379 కోట్లకు చేరింది. (ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ)

చదవండి :  అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌‌కు షాకివ్వనున్న జియో మార్ట్

మరిన్ని వార్తలు