కస్టమర్లకు వొడాఫోన్‌ మరో‌ ఆఫర్‌

20 Jul, 2020 16:42 IST|Sakshi

ముంబై: మొబైల్‌ దిగ్గజం వొడాఫోన్‌ ఇండియా తమ పోస్ట్‌పేడ్‌ కస్టమర్లకు మరో ఆఫర్‌ ప్రకటించింది. పోస్ట్‌పేడ్‌ కస్టమర్లకు ఈసిమ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. అయితే యాపిల్‌ స్మార్ట్‌ఫోన్లను వాడే కస్టమర్లకు మాత్రమే మొదటగా ఇసిమ్‌ అందుబాటులో రానుందని తెలిపింది. కాగా త్వరలోనే శాంసంగ్‌ గాలెక్సీ జడ్‌ ఫ్లిప్‌, శాంసంగ్‌ గాలెక్సీ ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్లకు ఇసిమ్‌ సేవలు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ముంబై, న్యూఢిల్లీ, గుజరాత్‌ తదితర రాష్ట్రాలు తమ కస్టమర్లకు ఇసిమ్‌ సేవలు అందుబాటులో ఉంచామని, త్వరలోనే దేశంలోనే మిగతా నగరాలకు విస్తరిస్తామని వోడాఫోన్‌ తెలిపింది 

ఇసిమ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునే విధానం: వొడాఫోన్‌ కస్టమర్‌ అయితే 199నంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ చేయాలి, తరువాత eSIM(ఇసిమ్‌) ఈమెయిల్‌ ఐడీని టైప్‌ చేయాలి. ఈమెయిల్‌ను నమోదు చేశాక మెదట ఎస్‌ఎమ్‌ఎస్‌ను పంపించి, ఇన్‌స్టాల్‌ ప్రక్రియను ప్రారంభించాలి. సరియైన ఈమెయిల్‌ను నమోదు చేస్తే 199 అనే నంబర్‌తో రిజిస్టర్‌ అయిన మొబైల్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ వస్తుంది. ఆ తరువాత  ఇసిమ్‌ ఆఫర్‌ను నిర్దారిచడానికి కస్టమర్లు ఈసిమ్‌వైతో రిప్లై చేయాలి. ఆ తర్వాత కస్టమర్ల అభ్యర్థనకు మరోసారి 199నెంబర్‌తో మరో ఎస్‌ఎమ్‌ఎస్‌ వస్తుంది.

ఆ తర్వాత రిజిస్టరయిన ఈమెయిల్‌కు క్యూఆర్‌ కోడ్‌  వస్తుంది. కస్టమర్లు క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. ఈ ప్రక్రియలో మొదటగా కస్టమర్లు తమ మొబైల్‌ను వైఫైలేదా మొబైల్‌ డేటాకు కనెక్ట్‌ చేయాలి. కనెక్టు చేశాక సెట్టింగ్స్‌ ఆఫ్టన్‌లోకి వెళ్లాక యాడ్‌ డేటా ప్లాన్‌ దగ్గర క్లిక్‌ చేయాలి. మరోవైపు కొత్త కస్టమర్లకు వొడాఫోన్‌ స్టోర్స్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవాలి. పైన తెలిపిన ప్రక్రియనే వారు కూడా అనుసరించవచ్చు. ఇసిమ్‌ను ద్వారా విభిన్న ఫ్రోఫైల్స్‌ను కస్టమర్లు వినియోగించుకోవచ్చు. (చదవండి: భారత్‌లో కష్టమే అంటున్న వొడాపోన్‌ ఐడియా)

మరిన్ని వార్తలు