వోడాఫోన్‌ బంపర్‌ ఆఫర్‌ : ఆ సేవలు ఏడాది ఉచితం

25 Jun, 2018 16:32 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ఆన్‌లైన్‌​ రీటైలర్‌ అమెజాన్‌, టెలికాం ఆపరేటర్‌ వోడాఫోన్‌ ఇండియా తమ కస‍్టమర్లకు  సువర్ణావకాశాన్ని అందిస్తున్నాయి. మార్కెట్లో పోటీ తట్టుకునే  వ్యూహంలో  ప్రధాన ప్రత్యర్థి జియోకి షాకిచ్చేలా ఎయిర్‌టెల్‌ నిర్ణయం తీసుకోగా తాజాగా.. ఎయిర్‌టెల్‌ను వోడాఫోన్‌ను ఫాలో అవుతోంది.  టీవీ, వీడియో సర్వీసులను ఉచితంగా అందించే ప్రణాళికలో అమెజాన్‌ ప్రైమ్‌తో ఒక భాగస్వామ్యం కుదర్చుకుంది. ఇందులో భాగంగా వోడాఫోన్‌ రెడ్‌ పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదారులకు  వెయ్యి రూపాయల విలువైన అమెజాన్‌ ప్రీమియం వీడియో ఆఫర్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందిస్తోంది.  ఈ ఆఫర్‌లో  వోడాఫోన్‌ రెడ్‌ ప్లాన్‌ రూ.399 నుంచి ప్రారంభం​.
 
వోడాఫోన్‌​ రెడ్‌ పోస్ట్‌పెయిడ్‌  ప్లాన్లను అప్‌గ్రేడ్‌ చేసుకున్న కస్టమర్లకు  వెయ్యి రూపాయల విలువైన అమెజాన్‌ ప్రైమ్‌ ఉచిత చందాను అందిస్తోంది.  వోడాఫోన్‌ ప్లే యాప్‌ ద్వారా  ఈ ఆఫర్‌ను పొందవచ్చు.  యాప్‌లో లాగిన్‌ అయ్యి  స్పెషల్‌ వోడాఫోన్‌ అమెజాన్‌ ఆఫర్‌పై క్లిక్‌  చేయాలి. అనంతరం రిజిస్టర్డ్‌ ​ మొబైల్‌కి వచ్చిన  ఓటీపీని ఎంటర్‌ చేస్తే ఆటోమేటిగ్గా అమెజాన్‌  ప్రైమ్‌ వీడియో​  మెంబర్‌షిప్‌ వస్తుంది.

వేలకొద్దీ సినిమాలు, వీడియోలు, టీవీషోలు, సంగీతంలాంటి 999రూపాయల విలువైన ప్రీమియమ్ సేవలను వోడాఫోన్ రెడ్‌ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అందించనున్నామని అమెజాన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  అమెజాన్‌ భాగస్వామ్యంతో  వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లకు షాపింగ్‌తో పాటు వినోదాన్నికూడా  అందించడం ఆనందంగా ఉందని అమెజాన్ ప్రైమ్ ఇండియా  డైరెక్టర్ అక్షయ్ సాహి చెప్పారు. ఈ భాగస్వామ్యం ద్వారా కస్టమర్లకు విలువైన సేవలను అందించనున్నామని వోడాఫోన్‌ ఇండియా డైరెక్టర్‌  అవనీష్‌ ఖోస్లా తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు