జియో, ఎయిర్‌టెల్‌కు కౌంటర్ : వొడాఫోన్ సూపర్ ఆఫర్

22 May, 2019 12:51 IST|Sakshi

వొడాఫోన్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌

ఎయిర్‌టెల్‌, జియోకు షాక్‌

వోడాఫోన్‌ కొత్త  ప్రీపెయిడ్‌ ఆఫర్‌ : ఏడాది పాటు ఉచితం 

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ టెలికం రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశం  తరువాత నుంచి  జోరందుకున్న టారిఫ్‌ల వార్‌ కొనసాగుతోంది. తాజాగా ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్టెల్‌, జియోకు షాకిచ్చేలా వొడాఫోన్‌ అద్భుత ఆఫర్‌  ప్రకటించింది. తాజాగా, వొడాఫోన్ తన యూజర్లకోసం సూపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.  సిటీబ్యాంక్ భాగస్వామ్యంతో సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఇది వోడాఫోన్‌  ఎగ్జిస్టింగ్ యూజర్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది.  

రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ లాంటి ప్రయోజనాలతో  కొత్త ప్రీపెయిడ్‌  ప్లాన్‌ను తీసుకొచ్చింది.  ఇందులో  సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ప్యాకేజీలో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత ఫోన్ కాల్స్  ఏడాది పాటు ఉచితంగా అందిస్తుంది.  ఇది కేవలం వొడాఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. 

వొడాఫోన్ వెబ్‌సైట్ ద్వారా సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అలాగే ఇప్పటికే వోడాఫోన్ యూజర్ అయి ఉండాలి. (ఫస్ట్‌ టైమ్ వోడాఫోన్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు) . సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  క్రెడిట్ కార్డు  క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయిన నెల రోజుల్లోనే   క్రెడిట్‌ కార్దు ద్వారా ఒకేసారి లేదా దఫ దఫాలుగా  రూ.4,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.  వోడాఫోన్ లేదా ఐడియా వెబ్‌సైట్ ద్వారాగానీ, ఎక్కడైనా ఖర్చు చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా ఆ మొత్తం ఖర్చు చేసిన అనంతరం ఆటోమేటిక్‌గా  వొడాఫోన్ ఆఫర్‌కు  యూజర్‌  అర‍్హుడవుతారు. ఇందుకు సంబంధించిన బెనిఫిట్స్ 45 రోజుల్లో  వొడాఫోన్‌కు క్రెడిట్ అవుతాయి. ఆ తర్వాత  నుంచి  రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పంపించుకునే  సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఆఫర్‌ వాలిడిటీ సంవత్సరం (365) రోజులు.  అయితే ఈ ఆఫర్ కొన్ని సర్కిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. 

ఈ ఆఫర్ ఎక్కడెక్కడ  అందుబాటులో ఉంది
ఈ కొత్త ప్రీపెయిడ్‌ ఆఫర్‌ పరిమిత సర్కిళ్లకు మాత్రమే  అంటే..ఢిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూరు, వడోదర, చండీగఢ్, సికింద్రాబాద్, కోల్‌కతా, చెన్నై, పుణే నగరాల్లో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని సర్కిల్స్‌లో ఈ ఆఫర్‌ను విస్తరిస్తారా లేదా  అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.  వోడాఫోన్ వెబ్‌సైట్ ప్రకారం ఈ ఆఫర్ జూలై 31వ తేదీ వరకు ఉంది.  మరిన్ని వివరాలు వొడాఫోన్ వెబ్‌సైట్‌లో

కాగా ఎయిర్‌టెల్‌ తరహాలోనే వొడాఫోన్‌ కూడా 1699  రూపాయల వార్షిక ప్లాన్‌ను ఇప్పటికే లాంచ్‌ చేసింది. ఇందులో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తోపాటు రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు, 1 జీబీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా