ఫోక్స్‌వ్యాగన్ ప్రమాణాలపై భారత్‌లోనూ దర్యాప్తు

26 Sep, 2015 00:21 IST|Sakshi
ఫోక్స్‌వ్యాగన్ ప్రమాణాలపై భారత్‌లోనూ దర్యాప్తు

న్యూఢిల్లీ : ఫోక్స్‌వ్యాగన్ కార్ల  పర్యావరణ ప్రమాణాలపై భారత్‌లో కూడా దర్యాప్తు మొదలైంది. ఈవిషయమై దర్యాప్తు చేయాలని ఆటోమోటివ్ రీసెర్చ్  అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్‌ఏఐ)ను  భారీ పరిశ్రమల శాఖ ఆదేశించింది. అమెరికాతో సహా పలు కంపెనీల్లో పర్యావరణ నిబంధనల విషయంలో ఫోక్స్‌వ్యాగన్ మోసాలకు పాల్పడిందన్న విషయం ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే.

భారత్‌లో కూడా ఫోక్స్‌వ్యాగన్ మోసానికి పాల్పడిందని తేలితే,  కఠిన  చర్యలు,  జరిమానా తప్పవని, కార్లను రీకాల్ చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారొకరు వెల్లడించారు. ఫోక్స్‌వ్యాగన్ నుంచి కొన్ని వివరాలు కోరామని, వారి ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నామని ఏఆర్‌ఏఐ డెరైక్టర్ రష్మి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు