ఓల్టాస్‌ లాభం రూ.107 కోట్లు

7 Nov, 2018 00:35 IST|Sakshi

12 శాతం వృద్ధి

రూమ్‌ ఏసీల్లో 2 శాతం పెరిగిన మార్కెట్‌ వాటా

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన ఓల్టాస్‌ కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 12 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.95 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.107 కోట్లకు పెరిగిందని ఓల్టాస్‌ తెలియజేసింది.

కార్యకలాపాల ద్వారా సమకూరిన ఆదాయం రూ.1,032 కోట్ల నుంచి 37 శాతం వృద్ధితో రూ.1,415 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.87 కోట్లుగా ఉన్న ఎబిటా ఈ క్యూ2లో 25 శాతం వృద్ధితో రూ.109 కోట్లకు పెరిగింది. నిర్వహణ మార్జిన్‌ 8.4 శాతం నుంచి 7.6 శాతానికి తగ్గిందని కంపెనీ తెలిపింది.  

కొనసాగుతున్న అగ్రస్థానం.....
రూమ్‌ ఏసీల మార్కెట్లో తమ అగ్రస్థానం కొనసాగుతోందని ఓల్టాస్‌ తెలిపింది. గత క్యూ2లో 23.2 శాతంగా ఉన్న తమ మార్కెట్‌ వాటా ఈ క్యూ2లో 25.6 శాతానికి పెరిగిందని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు