ఇక భారత్‌లో వోల్వో గ్రూప్ ఫైనాన్షియల్ సేవలు

13 Oct, 2015 00:51 IST|Sakshi
ఇక భారత్‌లో వోల్వో గ్రూప్ ఫైనాన్షియల్ సేవలు

బెంగళూరు: వోల్వో ఫైనాన్షియల్ సర్వీసెస్ సోమవారం భారత్‌లో తన సేవలను ప్రారంభించింది.  వోల్వో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐషర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్‌డీఎల్‌జీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్లతో.. మూడు విభిన్న బ్రాండ్ల కింద కస్టమర్ ఫైనాన్షింగ్ కార్యకలాపాలను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. పరికరాలు, రుణాలు, అద్దె, బీమా, నిర్వహణ, ఇతర మార్కెట్ సేవలకు సంబంధించి సమగ్ర రుణ సదుపాయాలను కస్టమర్లకు, వోల్వో గ్రూప్, వీఈ కమర్షియల్ వెహికల్స్ (భారత్‌లో వోల్వో గ్రూప్, ఐషర్ మోటార్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్)  డీలర్లకు అందజేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. సమగ్ర సేవలు ఒక్కచోటే పొందే వెసులుబాటును కల్పించడం ధ్యేయంగా వోల్వో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రారంభమైంది.

మరిన్ని వార్తలు