100 అంగుళాల 4కే స్మార్ట్‌ టీవీ, ధర వింటే షాక్‌

5 Sep, 2018 19:56 IST|Sakshi
వీయూ 100 స్మార్ట్‌ టీవీ లాంచ్‌

ప్రపంచంలోనే తొలి 100 అంగుళాల 4కే ఎల్‌ఈడీ టీవీ భారత మార్కెట్‌లోకి వచ్చింది. పాపులర్‌ లగ్జరీ టెలివిజన్‌ బ్రాండ్‌ ఈ సరికొత్త స్మార్ట్‌ టీవీని వీయూ 100 పేరుతో మన మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. దీని ధర రూ.20 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇదే తమ అత్యంత ఖరీదైన స్మార్ట్‌ టీవీగా కంపెనీ తెలిపింది. ఈ కొత్త టీవీ 100 అంగుళాల ప్యానల్‌, 224 ఐఫోన్ల సైజుతో సమానమని కంపెనీ అభివర్ణించింది. వీయూ సుపీరియర్‌ ప్యానల్‌ టెక్నాలజీతో ఇది రూపొందింది. 4కే ఆల్ట్రా హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లేను ఇది కలిగి ఉంది. దీంతో ప్రీమియం వ్యూయింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను టెలివిజన్‌ వీక్షకులు పొందవచ్చు. 2.5 బిలియన్‌ కలర్స్‌ను ఇది రీప్రొడ్యూస్‌ చేస్తుంది. ఈ టీవీ ద్వారా ఏ+ గ్రేడ్‌ ప్యానల్‌ను కంపెనీ అందిస్తోంది. 

5 డోల్బే-సర్టిఫైడ్‌ స్పీకర్స్‌తో ఈ పెద్ద టీవీని వీయూ తీసుకొచ్చింది. ఇది ప్రతి స్వరం కూడా స్పష్టంగా వినిపించేలా.. 2000 వాట్‌ స్పీకర్స్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో స్మార్ట్‌ ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న ఈ టీవీ, 16జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను, 2.5జీబీ ర్యామ్‌తో రూపొందింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ ఇంటిగ్రేషన్‌, క్రోమోకాస్ట్‌ సపోర్ట్‌ ఈ డివైజ్‌లో ఉన్నాయి. వీయూ 100ను మొబైల్స్‌కు, ల్యాప్‌టాప్స్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. వాయిస్‌ కమాండ్‌లతో లైటింగ్‌ను, ఎయిర్‌ కండీషనింగ్‌ను కూడా ఇది కంట్రోల్‌ చేస్తుంది. మూడు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ ఏఆర్‌సీ/సీఈబీ, బ్లూటూత్‌, వైఫై, ఏవీ ఇన్‌పుట్‌, ఆర్‌ఎఫ్‌ రేడియో ఫ్రీక్వెన్సీ ఇన్‌పుట్‌ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను ఇది కలిగి ఉంది. యూట్యూబ్‌, హాట్‌స్టార్‌, హంగామా వంటి ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌తో ఇది వచ్చింది. దీని బరువు 104కేజీలు. వీయూ స్టోర్‌కి వెళ్లి, దీన్ని బుక్‌ చేసుకోవచ్చు. ఏడాది వారెంటీతో ఇది లభ్యమవుతుంది. వీయూ అధికారిక స్టోర్లలో దీన్ని ప్రస్తుతం కంపెనీ అందిస్తుంది. పార్టనర్ల స్టోర్ల వద్ద కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. 
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాభాల హుషారు: 10700 ఎగువకు నిఫ్టీ

ఏడాదిన్నరలో రూ 50,000 కోట్ల పన్ను ఎగవేత..

పారిశ్రామిక దిగ్గజాలతో నేడు ప్రధాని భేటీ

అమెరికాను బట్టి అంచనా వేయొద్దు!

పేపర్‌లెస్‌ ఖాతాలకు ఎస్‌బీఐ ‘యోనో’ నో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాపీ బర్త్‌డే బంగారం

అభిమానులకు తలైవా హెచ్చరిక

‘నేను అలా పిలిస్తే ఆమె స్పృహ తప్పడం ఖాయం’

సమయం లేదు

మేం ముగ్గురమయ్యాం

మరో స్టార్‌ కిడ్‌ ఎంట్రీ