వెరైటీ ఫీచర్లతో.. వీయు ప్రీమియం 4కె టీవీ..

13 Mar, 2020 09:03 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో:టీవీల ఉత్పత్తికి పేరొందిన వీయు టెలివిజన్‌ ఆధునిక టెక్నాలజీతో వీయు ప్రీమియం 4కె టీవీని రూపొందించింది. దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసిన సందర్భంగా వియు టెలివిజన్‌ సీఈఓ దేవిత సరఫ్‌ మాట్లడుతూ.. ఈ ప్రీమియం 4కె టీవీలో అత్యున్నత శ్రేణి ఫీచర్స్‌ను జోడించి, నూతన హంగులతో డిజైన్‌ చేశారు. దీన్ని 3 విభిన్న పరిమాణాల్లో (43, 50, 55 అంగుళాలు) çతయారు చేశామని, ఆండ్రాయిడ్‌ 9.0 సాంకేతికతతో, ప్రత్యేకమైన డాల్బీ సౌండ్‌ సిస్టమ్‌తో రూపొందించామని తెలిపారు.  

డిజిటల్‌ మార్కెటింగ్‌పై ఫ్రీడెమో
కెల్లీ టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 14న అమీర్‌పేట్‌లో డిజిటల్‌ మార్కెటింగ్‌పై ఉచిత డెమోను ఇవ్వనున్నారు. ఇందులో డిజిటల్‌ మార్కెటింగ్‌లో భాగమైన ఎస్‌ఈఓ, ఎస్‌ఎమ్‌ఏ, ఎస్‌ఈఎమ్‌ తదితర అంశాలపైన అనుభవజ్ఞులతో శిక్షణ ఉంటుంది. కొత్తగా ఈ రంగంలో ఉద్యోగం ఆశిస్తున్నవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 

స్వాద్‌ అప్నేపన్‌ కా...
సాక్షి, సిటీబ్యూరో: ట్రాన్స్‌ జెండర్ల సమస్యలపై మానవతా దృక్పథంతో ఆలోచించాలనే సందేశంతో రూపొందించిన స్వాద్‌ అప్నేపన్‌ కా క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు బ్రూక్‌ బాండ్‌ రెడ్‌ లేబుల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి ఒక్కరినీ ఆదరించాలనే ఆలోచనను కలిగించాలనే ఈ ప్రచార చిత్రం రూపకల్పన చేశామని, మనసున్న ప్రతి ఒక్కరికీ ఇది స్పందనలు కలిగిస్తుందని సంస్థ ప్రతినిధులు అంటున్నారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా