శాంసంగ్, ఎల్జీలకు వియూ చెక్ పెడుతుందా?

12 May, 2016 16:23 IST|Sakshi
శాంసంగ్, ఎల్జీలకు వియూ చెక్ పెడుతుందా?

న్యూఢిల్లీ:   స్మార్ట్ టీవీల రంగంలో శాంసంగ్, ఎల్జీ కు పోటీగా వియూ శరవేగంగా ముందుకొస్తోంది.   తాజాగా వియూ  టెక్నాలజీస్ మూడు టీవీలను మార్కెట్ లో లాంచ్ చేసిన మిగిలిన పోటీ  సంస్థలకు  భారీ షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్మార్ట్ ఫీచర్స్ తో, తక్కువ ధరకే బడ్జెట్ స్మార్ట్ టీవీలతో   వియూ వినియోగదారులను ఊరిస్తోంది.    స్మార్ట్ ఫీచర్స్ ద్వారా అటు వినోదాన్ని, ఇటు సోషల్ మీడియాను   టీవీ తెరపై  వినియోగదారులకు అందుబాటులోకి తెస్తూ, టీవీ మార్కెట్ లో హల్ చల్ చేయడానికి సిద్ధమౌతోంది.  32 అంగుళం నుంచి 55 అంగుళాల పరిధిలో మూడు స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. వీటిధరలను  రూ .20,000 నుంచి, రూ.52,000 గా నిర్ణయించింది.  32 అంగుళాల టీవీని అతి తక్కువ ధరలో రూ .20,000 లకే అందిస్తున్నట్టు  వియు ప్రకటించింది.


ప్రఖ్యాత వీడియో చానల్స్  యప్ టీవీ, రెడ్ బుల్  సహా,  మిగిలిన  అన్ని యాప్ లను ఈ టీవీలో అనుసంధానం  చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.  అలాగే ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్,  లాంటి సోషల్ మీడియా లకు కనెక్ట్ అవడమే కాకుండా, స్ర్కీన్ షేరింగ్ అవకాశం కూడా ఉందని తెలిపింది. క్వాడ్-కోర్ ఇంటర్నెట్ వీడియో ప్రాసెసర్ తో పూర్తి హెచ్డిలో కంటెంట్ తో  రెండు   టీవీలను అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో   ఫ్లిప్ కార్ట్ ద్వారా  ఈ రోజు నుంచే  ఈ టీవీలను బుక్ చేసుకోవచ్చు.  
 

మరిన్ని వార్తలు