జియో ఫైబర్‌ : జుట్టు పీక్కుంటున్న దిగ్గజాలు

5 Sep, 2019 17:31 IST|Sakshi

సాక్షి, ముంబై:  జియో ఫైబర్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు మరికొద్దిసేపట్లో కమర్షియల్‌గా లాంచ్‌ కానున్నాయి. ఈ నేపథ్యంలో  పలు జోక్‌లు, వ్యంగ్య కామెంట్లు,  సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.  ముఖ్యంగా లాంచింగ్‌ కోసం వేచి చూస్తున్నామంటూ మరికొంతమంది ఉత్సాహంగా కామెంట్‌ చేస్తున్నారు.   ప్రధానంగా టెలికా మార్కెట్లో సంచలనాలు నమోదు చేసిన జియో డీటీహెచ్‌ మార్కెట్లో ​ కూడా పలు కీలక ప్లాన్లను తీసుకురానుందని దీంతో దిగ్గజాలకు మరోసారి భారీషాక్‌ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

కాగా జియో ఫైబర్‌ వార్షిక ప్లాన్‌ తీసుకున్న వారికి ఉచితంగా హెచ్‌డీ టీవీ సెట్‌ కూడా అందిస్తామంటూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ వార్షిక సర్వసభ్య స​మావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద జియో ఫైబర్‌ రాకతో చాలామటుకు డైరెక్ట్‌ టు హోమ్‌ సేవలందించే సంస్థల వ్యాపారాలకు గట్టి దెబ్బే తగిలే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీన్ని తట్టుకునేందుకు ఆయా సంస్థలు ఇప్పటికే వివిధ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి కూడా. జీ5, హుక్‌ వంటి పలు వీడియో స్ట్రీమింగ్‌ మొబైల్‌ యాప్స్‌ కంటెంట్‌ అందుబాటులోకి తెస్తూ భారతీ ఎయిర్‌టెల్‌ కొత్తగా రూ. 3,999కి సెట్‌ టాప్‌ బాక్స్‌ను ఆవిష్కరించింది. తొలి ఏడాది తర్వాత రూ. 999 వార్షిక ఫీజుతో సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించవచ్చు.

మరిన్ని వార్తలు