వాల్‌స్ట్రీట్‌ సెగ : దలాల్‌ స్ట్రీట్‌ ఢమాల్‌

11 Oct, 2018 09:31 IST|Sakshi

సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్‌ భారీగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్ల భారీ పతనం కావడంతో ఈక్వీటీ మార్కెట్లు కూడా కుదేలయ్యాయి. సెన్సెక్స్‌ 1000,నిఫ్టీ 300పాయింట్లు నష్టపోయాయి. దీంతో సెన్సెక్స్‌ 6నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 10200 స్థాయి కిందికి పడిపోయింది  దాదాపు అన్ని సెక్టార్లలోనూ భారీ నష్టాలే.  బ్యాంక్‌నిఫ్టీ  600పాయింట్లకు పైగా  క్షీణించింది. అన్ని షేర్లు ఆల్‌ టైం కనిష్టాన్ని తాకాయి. 

చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవిచూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు  భారీగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి కూడా  74.47 వద్ద రికార్డు కనిష్టాన్ని తాకింది. 74.45 వద‍్ద కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు