వాల్‌మార్ట్‌ రూ.1,616 కోట్ల పెట్టుబడి

12 Sep, 2019 11:03 IST|Sakshi

వాల్‌మార్ట్‌కు చెందిన భారత ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. ఈ పండుగల సీజన్‌ కోసం తన మాతృసంస్థ నుంచి భారీ మొత్తంలో పెట్టుబడిని అందుకుంది. సింగపూర్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలో రూ.1,616 కోట్లను పెట్టుబడిగా పెట్టినట్లు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ)కి ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఇందుకోసం భారత సంస్థ తనకు 4,64,403 ఈక్విటీ షేర్లను (ఒక్కో షేరు విలువ రూ.34,800) జారీ చేసినట్లు పేర్కొంది. ఈఏడాది జనవరిలో రూ.1,431 కోట్లను పెట్టుబడి పెట్టగా.. ఇది ప్రస్తుత ఏడాదిలో రెండో విడత పెట్టుబడిగా వెల్లడించింది.

మరిన్ని వార్తలు