2018 చివరకు ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌ క్లోజ్‌!!

6 Jun, 2018 01:32 IST|Sakshi

వాల్‌మార్ట్‌ అంచనా

హైదరాబాద్‌: అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌.. ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయా లని భావిస్తోంది. ఈ కంపెనీ మే నెలలో ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 16 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుత కార్యకలాపాల వల్ల తమ 2019 ఆర్థిక సంవత్సరపు నికర ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వాల్‌మార్ట్‌.. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్చంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు తెలియజేసింది.

వాల్‌మార్ట్‌ ప్రెసిడెంట్, సీఈవో, డైరెక్టర్‌ డగ్‌ మెక్‌మిలన్‌ ఇన్వెస్టర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఎక్కడైతే అపార అవకాశాలు అందుబాటులో ఉంటాయో అక్కడ మేం ఉండాలని కోరుకుంటాం. అందుకే ఫ్లిప్‌కార్ట్‌తో డీల్‌ కుదుర్చుకున్నాం’ అని పేర్కొన్నారు. భారత్‌లాంటి దేశాల్లో ఈ డీల్‌ విలువైనదని తెలిపారు. అదే చిన్న మార్కెట్‌ కలిగిన దేశాల్లో ఈ డీల్‌ ఉంటే మేం ఆసక్తి కనబరచే వాళ్లం కాదన్నారు. ముందుచూపుతో ఫ్లిప్‌కార్ట్‌తో డీల్‌ కుదుర్చుకున్నామని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు