వాల్మార్ట్ ల్యాబ్స్ చేతికి రెండు స్టార్టప్‌లు 

9 Jul, 2019 19:31 IST|Sakshi

బెంగళూరు ఆధారిత రెండు స్టార్టప్‌లను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌ 

వాల్‌మార్ట్‌ ల్యాబ్స్‌ చేతికి ఫ్లోకేర్, బిగ్‌ ట్రేడ్  

సాక్షి,  బెంగళూరు : అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌కు చెందిన  టెక్నాలజీ సంస్థ  వాల్‌మార్ట్ ల్యాబ్స్  భారత్‌లోని రెండు స్టార్టప్‌లను కొనుగోలు చేసింది.  బెంగళూరుకు చెందిన ఫ్లోకేర్, బిగ్‌ట్రేడ్  అనే కంపెనీలను వాల్‌మార్ట్‌ సొంతం చేసుకుంది.  తద్వారా అయితే ఈ డీల్‌కు  సంబంధించి నగదులావాదేవీల వివరాలు వెల్లడికాలేదు.  

గూగుల్ మాజీ ఉద్యోగులు స్థాపించిన  హెల్త్‌కేర్‌ టెక్‌ కంపెనీ  ఫ్లోకేర్.   సరసమైన ధరల్లో ఇది ఒక వైద్యుడు చేయవలసిన అన్ని పనులను ఒకే చోట నిర్వహిస్తుంది.  బిగ్‌ట్రేడ్ హోల్‌సేల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌.  "ఎండ్-టు-ఎండ్"  బిజినెస్‌ సొల్యూషన్స్‌ అందిస్తుంది. కాలిఫోర్నియాలో కూడా కార్యాలయం ఉన్న ప్లోకేర్‌  పాలో ఆల్టో  వాల్మార్ట్ ల్యాబ్స్ కస్టమర్ టెక్నాలజీ బృందంలో చేరారు.     ఈ  నేపథ్యంలో ఈ రెండు స్టార్టప్‌లను  వాల్‌మార్ట్‌ లాబ్స్‌ ఇండియా సొంతం చేసుకుంది. 
 
వాల్‌మార్ట్‌ ఆన్‌లైన్‌ ఫార్మసీ, సప్లయ్‌ ఛైన్‌ బిజనెస్‌ గ్లోబల్‌గా ప్రఖ్యాతి పొందిందనీ.. ఈ క్రమంలో  ఈ రెండు స్టార్టప్‌లను  సొంతం చేసుకోవడం తమకు చాలా  ఉత్సాహాన్నిస్తుందని వాల్‌మార్ట్‌  లాబ్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌  హరి వాసుదేవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.  తాజా  కొనుగోలుతో ప్లోకేర్‌,  బిగ్‌ ట్రేడ్‌ బృందం తమ వ్యాపార సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. 

మరిన్ని వార్తలు