ఎక్కాల్సిన రైల్వేస్టేషన్‌ను మార్చుకోవచ్చు!

29 Apr, 2018 09:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) బుక్‌ చేసుకున్న టికెట్‌లో ఎక్కాల్సిన స్టేషన్‌ను మార్చుకునే వీలును కల్పించింది. ఈ ప్రకటనతో ఇక ప్రయాణీకులు చివరి సమయాల్లో అనువుగా ఉండే స్టేషన్‌కు ప్రయాణాన్ని మార్చుకోవచ్చు. సాధారణంగా టికెట్‌ బుకింగ్‌ సమయంలో మనం ఎక్కాల్సిన స్టేషన్‌, చేరాల్సిన స్టేషన్‌ వివరాలను ముందుగానే ఇస్తాం. అయితే, తాజా నిర్ణయంతో ప్రయాణీకులు ఎక్కాల్సిన స్టేషన్‌ను ప్రయాణ తేదీకి ఒక్కరోజు ముందు వరకూ మార్చుకోవచ్చు. 

ఇందుకు కొన్ని నిబంధనలను పాటించాల్సివుంటుంది. ఒక టికెట్‌పై ఒకసారి మాత్రమే మార్పులకు అవకాశం ఉంటుంది. కరెంట్‌ బుకింగ్‌, వికల్ప్‌, ఐ టికెట్‌ ద్వారా బుక్‌ చేసుకున్న వాటికి ఇది వర్తించదని ఐఆర్‌సీటీసి పేర్కొంది. స్టేషన్‌ మార్చుకోవాలంటే... ఐఆర్‌సీటీసీ యాప్‌లో బుకింగ్‌ హిస్టరీకి వెళ్లాలి. బుక్‌ చేసుకున్న టికెట్‌ను క్లిక్‌ చేయాలి. చేంజ్‌ బోర్డింగ్‌ పాయింట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఎక్కాల్సిన(మార్చుకోవాల్సిన) రైల్వేస్టేషన్‌ను ఎంచుకోవాలి. 

>
మరిన్ని వార్తలు