శాంసంగ్‌కు బై, ఆపిల్‌కు సై : వారెన్‌ బఫెట్‌

25 Feb, 2020 08:41 IST|Sakshi

ఫోన్‌ మార్చిన ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌

ఫ్లిప్‌ ఫోన్‌  నుంచి  ఐఫోన్‌ 11  అప్‌గ్రేడ్‌ అయిన బఫెట్‌

వారెన్‌ బఫెట్‌.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నెం. 1 స్థానంలో ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం దాదాపు 88 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో బఫెట్‌ మూడో స్థానంలో ఉన్నారు.  ప్రస్తుతం బిలియనీర్‌ వారెన్‌ బఫెట్‌ ఓ అద్భుతం చేశాడు.  ఆపిల్‌  పెట్టుబడిదారుడుగా ఉన్న ఆయన ఎట్టకేలకు  స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్‌ అయ్యారు. అదీ శాంసంగ్‌కు బై చెప్పి, ఆపిల్‌ ఐ ఫోన్‌ను తీసుకోవడం విశేషం. సుదీర్ఘ కాలం నుంచి ఆయన ఉపయోగిస్తున్న శాంసంగ్‌ హెవెన్‌ ఫ్లిప్‌ ఫోన్‌ను పక్కకు పడేసి  తాజాగా ఐఫోన్‌ 11 తీసుకున్నారు. అయితే ఐఫోన్‌ 11లో ఏ రకం మోడల్‌ ఉపయోగిస్తున్నారనేది  మాత్రం చెప్పలేదు.(యాపిల్‌కూ ‘వైరస్‌’)

ఇప్పటికే ఆపిల్‌ సంస్థలో 5.6 శాతం వాటాను బఫెట్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీని విలువ 70 బిలియన్లు. ఇప్పటి వరకు ఫ్లిప్‌ ఫోన్‌ను ఉపయోగించిన బఫెట్‌ ప్రస్తుతం దానిని వాడటం లేదని స్మార్ట్‌ ఫోన్‌ను స్వీకరిస్తున్నానని వెల్లడించారు.  నా ‘ఫ్లిప్‌ ఫోన్‌ శాశ్వతంగా పోయింది’ ఆయన అని పేర్కొన్నారు. ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ దీనిపై స్పందించారు. చాలా కాలం నుంచి బఫెట్‌కు కొత్త ఫోన్‌ కొనాలని సూచించానని.. ఇప్పుడు ఆయన ఐఫోన్‌ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా కొత్త ఐఫోన్‌ కొన్నా కేవలం ఫోన్‌ కాల్స్‌ చేయడానికి ఉపయోగిస్తానని, అందులోని ఆప్షన్ల జోలికి వెళ్లనని వారెన్‌ బఫెట్‌ తెలిపారు. బఫెట్‌ వద్ద ప్రస్తుతం ఐపాడ్‌ కూడా ఉంది. దానిని పరిశోధన కొరకు, స్టాక్‌ మార్కెట్‌ ధరలను చూసుకోడానికి వాడుతానని ఆయన పేర్కొన్నారు.

చదవండి : (ఆపిల్‌ సీఈవోకు వేధింపులు, ఫిర్యాదు)

మరిన్ని వార్తలు