అంతర్జాతీయ షాక్‌ : భారీ నష్టాల్లో మార్కెట్లు

6 May, 2019 14:09 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్ల పతనం బాట పట్టడంతో దేశీయంగా కూడా ఆ​ షాక్‌ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 430 పాయింట్లవరకూ పతనమైంది. ప్రస్తుతం 362 పాయింట్లు కోల్పోయి 38,606 వద్ద కదులుతోంది. నిఫ్టీ సైతం 116పాయింట్లు కోల్పోయి11,346 వద్ద ట్రేడవుతోంది. తద్వారా11500 స్థాయి దిగువకు చేరింది.

ఐటీ తప్ప అన్ని రంగాలూ ముఖ్యంగా మెటల్‌ అత్యధికంగా నష్టపోతోంది. టాటా మోటార్స్‌, యస్‌బ్యాంక్‌, టైటన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ, యూపీఎల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌ టాప్‌  టూజర్‌గా ఉంది.  బీపీసీఎల్‌, టీసీఎస్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, ఎయిర్‌టెల్‌, ఐవోసీ  స్వల్పంగా లాభపడుతున్నాయి.  

మరిన్ని వార్తలు