షాకింగ్‌ : ఆగని పెట్రో సెగలు

3 Sep, 2018 10:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్‌ ధరల పెరుగుదలకు బ్రేక్‌ పడటం లేదు. ఇంధన ధరలు వరుసగా సోమవారం మూడోరోజూ భారమయ్యాయి. పెట్రోల్‌ లీటర్‌కు 30 పైసలుకు పైగా పెరగ్గా, పలు మెట్రో నగరాల్లో డీజిల్‌ ధరలు లీటర్‌కు 40 పైసలు పైగా పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ సోమవారం రూ 84.10 పైసలకు చేరింది. ఇక ముంబయిలో రెండు రోజుల కిందట రూ 83.76 పలికిన లీటర్‌ పెట్రోల్‌ ప్రస్తుతం రూ 86.56కు ఎగబాకింది. ఇక చెన్నైలో రూ 82.24, కోల్‌కతాలో రూ 82,.02, ఢిల్లీలో రూ 78.84గా నమోదైంది. మరోవైపు డీజిల్‌ ధరలూ భారమయ్యాయి.

ముంబయి, చెన్నై, ఢిల్లీల్లో డీజిల్‌ లీటర్‌కు వరుసగా రూ 75.54, రూ 75.19, రూ 71.15కు పెరిగింది. ఇక కోల్‌కతాలో డీజిల్‌ లీటర్‌ ధర రూ 74కు చేరింది. ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో పాటు డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తుండటంతో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింత పెరుగుతాయని చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పేర్కొన్నాయి.

కాగా అమెరికా ఏకపక్ష విధానాలతోనే అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు