ఆందోళన అక్కర్లేదు: జైట్లీ

25 Jun, 2016 02:29 IST|Sakshi
ఆందోళన అక్కర్లేదు: జైట్లీ

బీజింగ్: బ్రెగ్జిట్‌పై ఆందోళన అక్కర్లేదని, భారత ఆర్థిక వ్యవస్థ రక్షణ వలయాలు పటిష్టంగా ఉన్నాయని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో ఎదురయ్యే స్వల్ప-మధ్య కాలిక సవాళ్లను ఎదుర్కోవటానికి భారత్ సిద్ధమయిందన్నారు. ‘‘ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్‌లోటు, తగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు వంటి స్థూల ఆర్థికాంశాలు పటిష్ఠంగా ఉన్నాయి. తక్షణం కొన్ని ఒడిదుడుకులున్నా... సమీప కాలంలో వీటిని ఎదుర్కొనగలం’’ అని చెప్పారాయన. 100 బిలియన్ డాలర్ల ఆసియాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో పాల్గొనడానికి జైట్లీ ప్రస్తుతం బీజింగ్‌లో ఉన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు