షేర్లు.. బంగారం.. బాండ్లు.. ఏది బెటర్‌??

26 May, 2020 16:19 IST|Sakshi

క్రెడిట్‌ సూసీ సలహాలు

కరోనా కారణంగా ఎకానమీలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఈక్విటీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకొని నగదు దగ్గరపెట్టుకొనేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కొందరేమో బంగారంలో, కొందరు బాండ్లలో పెట్టుబడులకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్‌ క్రెడిట్‌ సూసీ ఈ మూడు పెట్టుబడి సాధనాలపై తన అభిప్రాయాలను ఇలా వెల్లడించింది. 
1. ఈక్విటీలు: రాబోయే నెలల్లో ఆటుపోట్లు సహజంగానే ఉంటాయి. అయితే ఇందులో భిన్న రంగాల తీరు భిన్నంగా ఉండొచ్చు. ఉదాహరణకు ఫార్మా రంగం మంచి పురోగతి చూపవచ్చు. ఇదే తరహాలో ఐటీ, టెలికం షేర్లు కూడా పాజిటివ్‌గానే ఉండే ఛాన్సులున్నాయి. స్వల్పకాలానికి ఫైనాన్షియల్స్‌ బలహీనంగా ఉండొచ్చు. కానీ దీర్ఘకాలానికి మంచి రాబడినిస్తాయి. 
2. బాండ్స్‌: ఆర్‌బీఐ మరింత వేగంగా లిక్విడిటీ పెంచే చర్యలు ప్రకటించవచ్చు. అందువల్ల బాండ్స్‌లో ‘‘ ఏఏ ’’ అంతకుమించిన రేటింగ్‌ ఉన్న బాండ్స్‌ను 3-5 ఏళ్ల కాలపరిమితితో పరిశీలించవచ్చు. రూపీ విలువ పెద్ద మార్పులు లేకుండా 74-76 మధ్యనే కదలాడవచ్చు. 
3. బంగారం: వరుసగా ఐదో నెల కూడా ఈటీఎఫ్‌ హోల్డింగ్స్‌ పెరిగాయి. సమీప భవిష్యత్‌లో రేటు తగ్గే ఛాన్సులు లేవు. అందువల్ల రాబోయే ఏడాదిలో అంతర్జాతీయంగా బంగారం 1800 డాలర్లను చేరవచ్చు. 

మరిన్ని వార్తలు