చిన్న మొత్తాల పొదుపునకు చిల్లు

1 Apr, 2017 00:20 IST|Sakshi
చిన్న మొత్తాల పొదుపునకు చిల్లు

0.1% మేర వడ్డీ రేటు తగ్గింపు
పీపీఎఫ్, కిసాన్‌ వికాస్‌పత్ర తదితర స్కీమ్‌లపై ప్రభావం
ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి వర్తింపు  


న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లలో ప్రభుత్వం కోత పెట్టింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), కిసాన్‌ వికాస్‌ పత్ర, సుకన్య సమృద్ధి పథకం మొదలైన స్కీములపై వడ్డీ రేట్లను 0.1 శాతం తగ్గించింది. జనవరి–మార్చి వ్యవధితో పోలిస్తే ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలానికి ఈ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది.

అయితే సేవింగ్స్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు మాత్రం వార్షికంగా 4 శాతం మేర యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను మూడు నెలలకోసారి సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామంతో బ్యాంకులు కూడా తమ డిపాజిట్‌ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు