మీ ఫ్లాట్‌ యూడీఎస్‌ ఎంత?

1 Sep, 2018 03:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫ్లాట్‌ కొనేముందు విస్తీర్ణం, వసతులు, లొకేషన్, వాస్తు వంటి వాటిపై శ్రద్ధ చూపినంతగా.. అన్‌ డివైడెడ్‌ షేర్‌ (యూడీఎస్‌) మీద శ్రద్ధ చూపించరు కొనుగోలుదారులు. వాస్తవానికి స్థిరాస్తి కొనుగోళ్లలో యూడీఎస్‌ అనేది చాలా ప్రధానమైనది. భూకంపాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు (లేదా) ఏదైనా ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం మీ ప్రాపర్టీని తీసుకున్నప్పుడు మీకిచ్చే పరిహారం యూడీఎస్‌ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అగ్రిమెంట్‌లో మీ ఇంటి యూడీఎస్‌ ఎంతనేది స్పష్టంగా ఉండి తీరాలి.

యూడీఎస్‌ అంటే..
అపార్ట్‌మెంట్‌లోని ఒక్కో ఫ్లాట్‌కు కేటాయించిన స్థలమే యూడీఎస్‌. అంటే అపార్ట్‌మెంట్‌ నిర్మిం చిన స్థలంలో మీ వాటా ఎంతనేది యూడీఎస్‌ చెబుతుంది. కాకపోతే ఇది అవిభాజ్య వాటా. అంటే విభజించడానికి వీలు కాదన్నమాట. ఫ్లాట్‌ విస్తీర్ణాన్ని బట్టి యూడీఎస్‌ కూడా మారుతుంది. యూడీఎస్‌ అనేది ఫ్లాట్‌ యజమాని పేరు మీద రిజిస్టరై ఉంటుంది. అయితే కొన్ని నిర్మాణాల్లో భవనం ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ)ని బట్టి కూడా యూడీఎస్‌ మారుతుంది.
ఎవరైనా... ఎక్కడైనా ఫ్లాట్‌ కొనుగోలు చేసే ముందు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి.
1.    ప్రాజెక్ట్‌ మొత్తం స్థలం ఎంత? ఎంత భాగంలో భవనాన్ని నిర్మించారు?
2.    ప్రాపర్టీ ధర పెరిగిందంటే అది ల్యాండ్‌ విలువ పెరిగిందని అర్థం. అంతే తప్ప బిల్డింగ్‌ విలువ పెరిగిందని కాదు. అంటే ప్రాపర్టీ పెరుగుదల అనేది యూడీఎస్‌ మీద ఆధారపడి ఉంటుందన్నమాట.

యూడీఎస్‌ను ఎలా లెక్కిస్తారు?
యూడీఎస్‌ లెక్కింపు అనేది అపార్ట్‌మెంట్‌ సూపర్‌ బిల్టప్‌ ఏరియా మీద ఆధారపడి ఉంటుంది. అంటే అపార్ట్‌మెంట్‌లోని అన్ని ఫ్లాట్ల సూపర్‌ బిల్టప్‌ ఏరియాలూ లెక్కలోకొస్తాయన్నమాట. ఉదాహరణకు 2,400 చ.అ. స్థలంలో 4 ఫ్లాట్ల అపార్ట్‌మెంట్‌ను నిర్మించారనుకుందాం. ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం 1,000 చ.అ.లనుకుందాం. ఇప్పుడీ నాలుగు ఫ్లాట్ల

యూడీఎస్‌ ఎంతంటే?
యూడీఎస్‌ = ఒక్కో ఫ్లాట్‌ సూపర్‌ బిల్టప్‌ ఏరియా/ అన్ని ఫ్లాట్ల సూపర్‌ బిల్టప్‌ ఏరియా గీ మొత్తం ల్యాండ్‌ ఏరియా
1,000 గీ 2,400/4,000
అంటే ఒక్కో ఫ్లాట్‌ యూడీఎస్‌ 800 చ.అ.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెంటాతో రిలయన్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యం

క్యూ2లో అదరగొట్టిన టాటా స్టీల్‌

ఫ్లిప్‌కార్ట్‌కు బిన్నీ రాజీనామా..కొత్త సీఈవో

అపోలో టైర్స్‌ ఎండీకి షాక్‌ ‌: వేతనాల కోత

ఆపిల్‌ ఇండియా కొత్త బాస్‌ ఈయనే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

'సైరా' మ్యూజిక్‌ డైరెక్టర్‌ లైవ్‌ కన్సర్ట్‌

ఆమిర్‌ సినిమాకు పెట్టుబడి కూడా రాదా..?

స్టార్‌ హీరో సీరియస్‌ వార్నింగ్‌

బ్యాక్‌ టు ఫస్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌ అంటోన్న సుధీర్‌ బాబు!

‘వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం చెప్పను’

మీటూ.. నా రూటే సపరేటు!