వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌

23 Jan, 2018 13:54 IST|Sakshi

సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సాప్‌ తన యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇటీవల లాంచ్‌ చేసిన వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ను ఇకపై ఇండియాలో అద్భుతమైన ఆఫర్లతో  అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్‌ ప్లే స్టోర్‌నుంచి దీన్ని ఉచితంగా డోన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  ముఖ్యంగా ఆండ్రాయిడ్‌ యూజర్లకు దీన్ని అందుబాటులోకి వచ్చింది.   స్వంతంగా వ్యాపారాలు కలిగిన ఎవరైనా దీన్ని ఉచితంగా  డౌన్‌లోడ్‌ చేసుకుని తమ ఖాతాదారులకి నేరుగా  టచ్‌లో ఉండొచ్చు. తద్వారా సులభంగా వ్యాపార కార్యలాపాలను నిర్వహించుకోవచ్చు.

చిన్న వ్యాపారస్తులు తమ కస్టమర్లతో టచ్‌లో ఉండేలా వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ పనిచేయనుంది. ఈ యాప్ ద్వారా  షాప్, బిజినెస్, చిరునమా, వెబ్‌సూఐట్‌ తదితర వివరాలను అందుబాటులో ఉంటాయి.  ముఖ్యంగా వినియోగదారులకందించే సేవలతోపాటు వారి అడిగే సందేహాలకు తక్షణమే స్పదించవచ్చు. వాయిస్ , వీడియో కాల్స్ చేయడానికి కూడా అనుమతిస్తుంది.  అలాగే మీ కస్టమర్లకి  గ్రీటింగ్స్‌ తెలిపే అవకాశం కూడా.  అంతేకాదు మెసేజ్‌లను ఎంతమంది చదివారు అన్నది గణాంకాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్‌ లాగానే  ఈ బిజినెస్‌ యాప్‌ కూడా  కాల్స్‌, మెసేజ్‌లను థర్డ్‌పార్టీకి చేరకుండా ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను ఆఫర్‌  చేస్తోంది.  ప్రొఫైల్ ఫోటో  సెక్యూరిటీతోపాటు  లైవ్‌ లొకేషన్‌ షేరింగ్‌ను కూడా అనుమతిస్తుంది.

కాగా ఇటీవల  ఇండోనేషియా, ఇటలీ, మెక్సికో, యుకె,  యుఎస్‌  సహా కొన్ని మార్కెట్లలో  వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ మొదట లాంచ్‌ చేసింది.  అధికారిక లాంచింగ్‌ముందే ఇండియా,  బ్రెజిల్‌లో టెస్టింగ్‌ నిర్వహించింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో అందించిన అధికారిక డేటా ప్రకారం, వాట్సాప్‌కు భారతదేశంలో 200 మిలియన్ల మందికి పైగా క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది.
 

మరిన్ని వార్తలు