పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్ ఇక వాట్సాప్ నుంచి..

4 Apr, 2017 18:55 IST|Sakshi
పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్ ఇక వాట్సాప్ నుంచి..
పేమెంట్లు, మనీ ట్రాన్స్ఫర్లు ఇక వాట్సాప్ నుంచి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయట. భారత్ లో పెరుగుతున్న డిజిటల్ సర్వీసులకు వాట్సాప్ ఈ వినూత్న సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఫేస్బుక్ కు చెందిన వాట్సాప్ త్వరలోనే ఇండియాలో డిజిటల్ సర్వీసుల్లోకి రావడానికి సన్నద్ధమవుతున్నట్టు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
 
పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ సర్వీసుల్లోకి భారతీయులు  ఎక్కువగా మరలుతున్న క్రమంలో ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ లో ఎక్కువగా ఫేమస్ అయిన వాట్సాప్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. యూపీఐ వాడుతూ పేమెంట్ సిస్టమ్ తో ఇంటిగ్రేట్ అయ్యేలా కంపెనీ ప్రస్తుతం వర్క్ చేస్తుందని, ఈ చాట్ యాప్ ద్వారానే అన్ని పేమెంట్లు జరిగేలా ఇండియన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుందని ది కెన్ రిపోర్టు చేసింది. ఇండియా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) తెలిసిన టెక్నికల్, ఫైనాన్సియల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉద్యోగుల కోసం కంపెనీ గాలిస్తున్నట్టు వాట్సాప్ వెబ్ సైట్ కూడా  ఓ ఉద్యోగ ప్రకటన ఇచ్చేసింది. 
 
వచ్చే ఆరు నెలల్లోనే ఈ సర్వీసులు ప్రారంభించబోతున్నారట. డిజిటల్ సర్వీసుల్లో దూసుకెళ్తున్న పేటీఎంకు చెక్ పెట్టి, వాట్సాప్ ఆ స్థానాన్ని కొట్టేయాలని యోచిస్తుందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతమున్న 20 కోట్ల యూజర్ బేస్ ను మరింత పెంచుకోనుందని రిపోర్టు వెల్లడించింది. ఇండియన్ యూజర్ల కోసం ఓ స్పెషల్ ఫీచర్ ను తీసుకురాబోతున్నట్టు వాట్సాప్ అంతకముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
మరిన్ని వార్తలు