భారత డిజిటల్‌ కామర్స్‌కు వాట్సాప్‌ తోడ్పాటు

25 Feb, 2017 02:43 IST|Sakshi
భారత డిజిటల్‌ కామర్స్‌కు వాట్సాప్‌ తోడ్పాటు

న్యూఢిల్లీ: డిజిటల్‌ కామర్స్‌ విభాగంలో తమ వంతు తోడ్పాటు అందించడంపై చర్చించేందుకు మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్‌ యాక్టన్‌ శుక్రవారం కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. తమకు కీలకమైన భారత్‌లో దాదాపు 20 కోట్ల మంది వాట్సాప్‌ వినియోగిస్తున్నారని యాక్టన్‌ తెలిపారు. డిజిటల్‌ ఇండియా నినాదం లక్ష్యాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులు సురక్షితమైనవిగాను, సరళతరంగాను ఉంటాయని ఆయన వివరించారు.

భారత్‌లో కార్యకలాపాల విస్తరణపై మరింతగా ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు యాక్టన్‌ వెల్లడించినట్లు మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో భాగమైన వాట్సాప్‌ ప్రస్తుతం భారత్‌తో పాటు బ్రెజిల్‌ తదితర దేశాల్లో డీఫాల్ట్‌ మెసేజింగ్‌ యాప్‌గా మారింది. భారత్‌లో హైక్, స్నాప్‌చాట్, వైబర్‌ వంటి సంస్థలతో పోటీ పడుతోంది. వాట్సాప్‌కి 100 కోట్ల పైగా యూజర్లు ఉండగా.. ఇందులో సుమారు 20 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. ఆదాయ ఆర్జన దిశగా ఈ ఏడాది నుంచి యాడ్‌లపై కూడా వాట్సాప్‌ దృష్టి సారిస్తోంది.

మరిన్ని వార్తలు