వాట్సాప్‌లో కూడా లైవ్‌ లొకేషన్‌ షేరింగ్‌

18 Oct, 2017 10:53 IST|Sakshi

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌  అద్భుతమైన ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ సరికొత్త ఫీచర్‌  త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. అదే లైవ్ లొకేషన్ షేరింగ్ సదుపాయం.  వాట్సాప్‌  అధికారిక బ్లాగ్ ప్రకారం,  రాబోయే వారాలలో  ఆండ్రాయిడ్‌,  ఐఓ ఎస్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. గూగుల్  మ్యాప్స్ లాంటి వివిధ వేదికలపై ఈ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ,   వాట్సాప్‌ తాజా ఫీచర్‌   వినియోగదారులను భారీగా ఆకర్షించగలదని భావిస్తున్నారు.

నెలవారీ  1.3 బిలియన్ యాక్టివ్‌ యూజర్లతో దూసుకుపోతున్న వాట్సాప్‌  తాజా ఫీచర్లు ప్రపంచవ్యాప్త నవీకరణగా  నిలవనుంది. దీని ద్వారా వాట్సాప్  యూజర్లు తమ లైవ్ లొకేషన్‌ను అవతలి వాట్సాప్ యూజర్లకు, అలాగే  వాట్సాప్ గ్రూప్‌నకు కూడా  షేర్ చేయవచ్చు.  15 నిమిషాలు నాన్‌స్టాప్‌గా లైవ్‌ లో ఉండవచ్చు. ఇలా గరిష్టంగా సుదీర్ఘంగా  ఎనిమిది గంటల పాటు లైవ్‌ను ఎంచుకోవచ్చు.  ఈ  లైవ్ లొకేషన్‌ను షేరింగ్‌ తో యూజర్లు ఎక్కడ ఉన్నారో వారి ఫ్రెండ్స్‌కు, కుటుంబ సభ్యులకు సులభంగా తెలిసిపోతుంది.  అలాగే గ్రూపులకు సంబంధించి లైవ్‌లొకేషన్‌ను  ఎంచుకున్న గ్రూపు సభ్యుల లొకేషన్స్‌  ఒకే మ్యాప్‌లో దర్శనమిస్తాయి.  ఎంతసేపు లైవ్‌ లో ఉండాలనేది యూజర్‌ నిర్ణయించుకోవచ్చు. మరోవైపు  అబద్ధం చెప్పే  యూజర్లు ఈ కొత్త ఫీచర్‌కు దూరంగా ఉండాల్సిందే. చాట్ బాక్స్ ప్రక్కన పేపర్‌ క్లిప్ చిహ్నాన్ని నొక్కడం ద్వారా కొత్త ఫీచర్‌ను యాక్సెస్‌ చేయవచ్చు. అలాగే వినియోగదారుల గోప్యతపై కూడా వాట్సాప్‌ భారీ భరోసా కూడా ఇస్తోంది.  కాగా ఇదే ఫీచర్‌ స్నాప్‌ చాట్‌  ఈ  ఏడ్డాది సమ్మర్‌లో లాంచ్‌ చేసింది. అలాగే గూగుల్‌ మాప్స్‌,  ఫైండ్‌ మా  ఫ్రెండ్స్‌ యాప్‌ ద్వారా యాపిల్‌ కూడా లైవ్‌ లోకేషన్‌  సౌలభ్యాన్ని అందిస్తోంది. 

అలాగే  వాట్సాప్‌ యూజర్‌ ఫోన్‌నెంబర్‌ మార్చిన ప్రతిసారీ .. నెంబర్‌  షేరింగ్‌  ఇబ్బంది లేకుండా ఒక నోటిఫికేషన్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఈ నోటిఫికేషన్‌ద్వారా  యూజర్ మొబైల్ నంబర్ చేంజ్ చేశాడని వారికి తెలుస్తుంది. ఇక దీంతోపాటు త్వరలో అందించనున్న అప్‌డేట్ ద్వారా వాట్సాప్ యాప్ సైజ్‌ను కూడా భారీగా తగ్గించనుందట.

మరిన్ని వార్తలు