నెంబర్‌ సేవ్‌ చేయకుండానే ఛాటింగ్‌ చేయొచ్చు  

10 Sep, 2018 20:44 IST|Sakshi

మన రోజువారీ జీవితంలో వాట్సాప్‌ ఓ భాగమై పోయింది.  చాటింగ్‌కు చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నా  వాట్సాప్‌కే క్రేజ్‌ ఎక్కువ. టెక్ట్స్‌ మెసేజ్‌లు, ఫొటోలను వాట్సాప్‌ ద్వారా సులభంగా పంపుకోవచ్చు.  ఈ సౌలభ్యమే ఈ యాప్‌కు ఎక్కువ మంది ఆకర్షితులవడానికి ఓ కారణం. అయితే మనం పంపాలనుకున్న వ్యక్తి మొబైల్‌ నెంబర్‌ మన ఫోన్‌బుక్‌లో సేవ్‌ చేసి లేకపోతే వాట్సాప్‌లో మెసేజ్‌ పంపడం సాధ్యం కాదు. అయితే, ఆ సమస్యకు ఇప్పుడు పరిష్కారం దొరికింది. మొబైల్‌ నెంబర్‌ సేవ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌ పంపొచ్చు. 

మనతో అంతగా పరిచయం లేని వ్యక్తులకు ఒకటో రెండో, మెసేజ్‌లు పంపాల్సి రావచ్చు. తర్వాత మళ్లీ ఆ వ్యక్తులతో మనకు పని లేకపోవచ్చు. అయినా కానీ ఆ వ్యక్తి మొబైల్‌ నెంబర్‌ను ఇప్పటి వరకు కచ్చితంగా సేవ్‌ చేసుకున్న తర్వాతే మెసేజ్‌లు పంపాల్సి ఉంటుంది.  దీని వల్ల మనతో పరిచయం లేని వ్యక్తులు  వాట్సాప్‌లోని మన ప్రొఫైల్‌ ఫొటో చూసే అవకాశం ఉంది. ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. అలాగని థర్ట్‌ పార్టీ యాప్‌లను ఉపయోగించడం సెక్యూరిటీ పరంగా మంచిది కాదు. 

అయితే ఇప్పుడు మన మొబైల్‌ ఫోన్‌ బుక్‌లో నెంబర్‌ను సేవ్‌ చేయకుండానే వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌లను సులభంగా పంపేయచ్చు. దీనికోసం....మన ఫోన్‌లో వాడుతున్న బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి. ఇందులో అడ్రస్‌ బార్‌లో...https://api.whats App.com/send?phone= number  అని టైప్‌ చేయాలి. నంబర్‌ అన్న దగ్గర మనము ఎవరికైతే మెసేజ్‌ పంపాలనుకుంటున్నామో వారి  మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. ఆ ఫోన్‌ నెంబర్‌ కంట్రీ కోడ్‌ను కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంటర్‌ బటన్‌ను ప్రెస్‌ చేయాలి. వాట్సాప్‌ విండో ఓపెన్‌ అవుతుంది. మీరు ఆ నెంబర్‌కు మెసేజ్‌ పంపాలనుకుంటున్నారా? అని వస్తుంది. ఆ తర్వాత మనము సెండ్‌ మెసేజ్‌ అని నొక్కాలి. వాట్సాప్‌ చాట్‌ విండో ఓపెన్‌ అవుతుంది. తర్వాత మనము ఛాటింగ్‌ మొదలు పెట్టచ్చు. 

మరిన్ని వార్తలు