ఒకే వాట్సప్‌ ఖాతా మల్టీ డివైస్‌ కూడా!

9 May, 2020 16:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వాట్సప్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌. ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్ మెసేజింగ్ సేవ సంస్థ అయిన వాట్సాప్ యూజర్స్‌ ప్రస్తుత తమ వాట్సాప్ ఖాతాను మల్టీ డివైస్‌లకు కనెక్ట్ చేయడానికి అనుమతించే ఫీచర్‌పై అన్వేషిస్తున్నట్లు సమాచారం. మల్టి డివైస్‌లో వాట్సప్‌ ఖాతాను అనుమంతించే ఈ లక్షణాన్ని మొదట WABetaInfo గుర్తించిందిచినట్లు సదరు సంస్థ ట్వీట్‌ చేసింది. ఈ యాజమాన్యం దీనిపై వివరణ కూడా ఇచ్చారు. స్మార్ట్‌ ఫోన్స్‌, టాబ్లెట్స్‌ వంటి బహుళ పరికరాల్లో ఒకేసారి వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాను కనెక్ట్ చేయడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుందని తెలిపింది. (లోన్లు ఇవ్వబోతున్న వాట్సాప్‌!)

కాగా ప్రస్తుతం వాట్సాప్ ఒకే ఖాతా కోసం ఒకసారి ఒక పరికరంలో మాత్రమే యాక్సెస్ చేయడానికి అనుమతిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ వాట్సాప్ వెబ్ కోసం కూడా, ఫోన్‌లోని అనువర్తనానికి కనెక్ట్ అయినప్పుడు వినియోగదారుల ఖాతాను యాక్సెస్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఒకే ఖాతా కోసం ప్రతి డివైస్‌ నుండి ఇండిపెండెంట్‌గా మల్టీ డివైస్‌లకు మద్దతును అందించే అవకాశం ఉంది. కాగా భవిష్యత్తులో బీటా విడుదలను కంపెనీ కొనసాగిస్తున్నందున దీని గురించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే WABetaInfo షేర్‌ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం, మెసేజింగ్ సేవ వినియోగదారులను Wi-Fi ద్వారా తమ న్యూ డివైస్‌కు కనెక్ట్ చేయమని అడుగుతుంది. 

క్రొత్త ఫీచర్లు..
WABetaInfo నివేదిక ప్రకారం.. ఇది న్యూ డివైస్‌ చాట్ హిస్టరీని వేగంగా డౌన్‌లోడ్ చేస్తుంది. అంతేగా యూజర్ చాట్ చరిత్రను కూడా ఆ డివైస్‌లో కాపీ చేసే అవకాశం ఉంది. ఇక వాట్సాప్ కొత్త లింక్‌ డివైస్‌ల స్క్రీన్ ద్వారా స్నాప్‌షాట్‌లను కూడా ఇది షేర్‌ చేస్తుంది. వాట్సప్‌ లింక్‌ చేసే ప్రతి డివైస్‌ ఫిచర్స్‌ను ఒపెన్‌ మెసేజ్‌ చెయోచ్చు. “మరో డివైస్‌లలో వాట్సాప్ ఉపయోగించి మీ బ్రౌజర్ కంప్యూటర్ ద్వారా ఫేస్‌బుక్ పోర్టల్ నుండి సందేశాలను పంపంచిడం లేదా స్వీకరించ వచ్చు. ఇక మెసేస్‌ చేసిన అనంతరం బాటమ్‌లో పేర్కొన్నా బటన్‌ను క్లిక్‌ చేయాలి. కాగా నివేదిక ప్రకారం మల్టీ-డివైస్ ఫీచర్ ఇంకా అందుబాటులో లేనందున  రాబోయే నెలల్లో వాట్సాప్ బీటా వెర్షన్ల కోసం ఈ ఫీచర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు