యాప్‌ ఓపెన్‌ చేయకుండానే చాట్‌

8 May, 2018 13:18 IST|Sakshi
యాప్‌ ఓపెన్‌ చేయకుండానే చాట్‌ (ఫైల్‌ ఫోటో)

మెసేజింగ్‌ యాప్‌లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వాట్సాప్‌, తరుచు కొత్త కొత్త అప్‌డేట్‌లతో యూజర్లను అలరిస్తూ ఉంటోంది. ఇటీవలే డిలీట్‌ చేసిన ఫోటోలను, వీడియోలను రీస్టోర్‌ చేసుకునే ఫీచర్‌ను తన యాప్‌కు జత చేసిన వాట్సాప్‌, మరో అద్భుతమైన ఫీచర్‌ను తన యాప్‌పై లాంచ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తోంది. అదేమిటంటే.. యాప్‌ను ఓపెన్‌ చేయకుండానే యూజర్లు చాట్‌ చేసుకునే ఫీచర్‌. దీనికోసం ఫేస్‌బుక్‌కు చెందిన ఈ మెసేజింగ్‌ మాధ్యమం www.wa.me అనే డొమైన్‌ను రిజిస్ట్రర్‌ చేసుకుందని తెలిసింది.

వాట్సాప్‌ గురించి ఎప్పడికప్పుడు కొత్త విశేషాలు అందించే డబ్ల్యూఏబీటా ఇన్ఫో ఈ విషయాన్ని తెలిపింది. ఈ కొత్త డొమైన్‌ షార్ట్‌ లింక్‌  api.whatsapp.comగా పేర్కొంది. ఇది వెంటనే వాట్సాప్‌లో చాట్‌ ఓపెన్‌ చేసుకునేందుకు వాడనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌  2.18.138కు అందుబాటులో ఉందంట. ఆండ్రాయిడ్‌ 2.18.138 వెర్షన్‌ విజయవంతంగా wa.me అనే షార్ట్‌లింక్‌ను గుర్తించిందని, బ్రౌజర్‌ను వాడకుండానే చాట్‌ను ఆటోమేటిక్‌గా ప్రారంభించుకోవచ్చని డబ్ల్యూఏబీటా ఇన్ఫో తెలిపింది. లింక్‌ను వాడుతూ యూజర్లు టెక్ట్స్‌ పంపాలనుకునే వ్యక్తికి సంబంధించి https://wa.me/(phone number) టైప్‌ చేయాలి. దీంతో వెంటనే యూజర్లు ఆ చాట్‌కు వెళ్లిపోతారు. ఒకవేళ మీరు ఎంటర్‌చేసిన నెంబర్‌ తప్పు అయితే, వాట్సాప్‌ యూజర్లను నోటిఫై చేస్తుంది.

మరిన్ని వార్తలు