వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌

9 Apr, 2019 17:28 IST|Sakshi

నకిలీ వార్తలను నిరోధించే క్రమంలో మరో  కీలక ఫీచర్‌

గ్రూపు అడ్మిన్‌లకు  మరిన్ని పవర్స్‌

సాక్షి,ముంబై: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సొంతమైన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను లాంచ్‌ చేయనుంది. దేశీయంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా  ఫేక్‌ న్యూస్‌ను అరికట్టేందుకు ఫార్‌వర్డింగ్‌ ఇన్ఫో, ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్‌ లాంటి ఫీచర్లను ఇటీవల లాంచ్‌ చేసిన వాట్సాప్‌ తాజాగా గ్రూపు అడ్మిన్‌లకు మరిన్ని అధికారాలను ఇస్తూ ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.
 
ఫీక్వెంట్లీ ఫార్వర్డెడ్‌ (తరచుగా  ఫార్వార్డ్‌ చేసిన మెసేజ్‌)  నిరోధానికి మరో కొత్తలేబుల్‌ను ఆవిష్కరించనుంది. దీంతో సదరు మెసేజ్‌ ఎన్నిసార్లు ఫార్వార్డ్ అయిందో చెక్‌ చేసుకోవచ్చన్న మాట. నకిలీ వార్తల వ్యాప్తిని నిరోధించడానికి వాట్సాప్ తీసుకున్నచర్యల్లో ఇది తదుపరి దశగా భావిస్తున్నారు. తద్వారా వినియోగదారులకు నిరంతరం ఫార్వార్డ్‌ అవుతున్న మెసేజ్‌ల తలనొప్పులకు చెక్‌ పెట్టనుంది. 

వా బేటా అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ఫోన్లకోసం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది.  అనంతరం గ్రూపు సెటింగ్స్‌లో ఈ ఫీచర్‌తో త్వరలోనే అప్‌డేట్‌ చేయనుంది.   దీని ప్రకారం ఒక్క అడ్మిన్‌ తప్ప ఈ  ఫీక్వెంట్లీ ఫార్వర్డెర్డ్‌ ఆప‍్షన్‌ను చూసే, లేదా ఎడిట్‌ చేసే అవకాశం లేదు. అంతేకాదు సదరు మెసేజ్‌ను పార్వార్డ్‌ చేయాలా లేదా వద్దా అనేది కూడా గ్రూప్‌ అడ్మిన్‌ నిర్ణయించాల్సి ఉంటుంది.  దీంతో అసంబద్ధ, లేదా అసత్య వార్తల  తొందరగా వ్యాపించే ప్రక్రియ నెమ్మదిస్తుందని సంస్థ భావిస్తోంది. 

కాగా  రూమర్లు,  అసత్య వార్తలు, నకిలీ వార్తల  వ్యాప్తిలో తన  ప్లాట్‌ఫాం దుర్వినియోగాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం, చట్ట సంస్థలు, ఫాక్ట్‌ చెకర్స్, ఇతర స్వచ్ఛంద సంస్థలతో   వాట్సాప్‌  కలిసి  పనిచేస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు