వాట్సాప్ కొత్త నిబంధన : ఒక్కసారే

7 Apr, 2020 13:35 IST|Sakshi

నకిలీ వార్తలకు చెక్, ఫార్వార్డ్ మెసేజ్ లపై  ఆంక్షలు

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారానికి, నకిలీ వార్తలు అడ్డూ అదుపులేకుండా  కొనసాగుతోంది. పాత వార్తలు, పాత వీడియోలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తూ, వ్యాఖ్యానాలను జోడిస్తూ  పోస్ట్ చేస్తు వుండటం ఆందోళన రేపుతోంది.  చట్టపరంగా వీటి నిరోధానికి చర్యలను ప్రకటిస్తున్నప్పటికీ  ఫేక్ న్యూస్ ప్రవాహం  ఆగడం లేదు. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించిన నకిలీ వార్తలు, వీడియోలు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్, టిక్ టాక్ లాంటి  ప్లాట్ ఫాంలలో  విరివిగా షేర్ అవుతూ అనేక అపోహలను, ఆందోళనలు రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో  ఇక మీద తరుచుగా షేర్ చేసిన సందేశాన్ని లేదా, వీడియోను  ఒకసారి ఒక చాట్ కు మాత్రమే  ఫార్వార్డ్ చేసేలా  వాట్సాప్   ఆంక్షలు విధించింది. ఈ  నేపథ్యంలో  మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్ లో ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారాన్ని తెలుసుకునే వాట్సాప్ కొత్త  ఆంక్షలను విధించింది. ఇక మీద తరుచుగా షేర్ చేసిన సందేశాన్ని లేదా, వీడియోను ఒక చాట్ కు ఒక్కసారి మాత్రమే ఫార్వార్డ్ చేసేలా పరిమితి విధించింది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్  వినియోగదారులకు ఈ  రోజునుంచే  ఈ కొత్త  నిబంధన వర్తించనుంది.  అలాగే తరచుగా ఫార్వార్డ్ చేయబడిన సందేశాలను వాట్సాప్‌లో డబుల్ టిక్‌ ద్వారా సూచిస్తుంది.

కోవిడ్-19 తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీని ప్రకారం వాట్సాప్ లో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు షేర్ చేయబడిన సందేశాలను ఒక చాట్‌కు మాత్రమే ఫార్వార్డ్  చేయగలం.  అలాగే తరచుగా ఫార్వార్డ్ చేసిన వాటిని యూజర్లు గుర్తించేలా డబుల్ టిక్ తో హైలైట్ చేస్తుంది. గతంలో నకిలీ వార్తలను అడ్డుకునే నేపథ్యంలో ఐదుసార్లకు మించి ఫార్వార్డ్ చేయకుండా పరిమితి విధించడంతో  25 శాతం ఫేక్ న్యూస్ బెడద తప్పిందని  వాట్సాప్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

అలాగే సందేశాలను ధృవీకరించడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. ఫార్వార్డ్ చేసిన సందేశాలను తెలుసుకునేలా వెబ్‌లో ఒక ఫీచర్ను వాట్సాప్ పరీక్షిస్తోంది. ఇందుకోసం  వెబ్ లో భూతద్దం చిహ్నాన్ని జోడించింది.  ప్రస్తుతం ఐవోఎస్, ఆండ్రాయిడ్  బీటా వెర్షన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. 

చదవండి : ఎన్నారై డాక్టర్‌ను బలిగొన్న కరోనా
బంగారం రికార్డు : రూ. 45 వేలను దాటేసింది

మరిన్ని వార్తలు