వాట్సాప్‌ పేమెంట్స్‌కు లైన్‌ క్లియర్‌

27 Jun, 2019 09:42 IST|Sakshi

బెంగళూర్‌ : ఆర్‌బీఐ సూచనలతో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన పేమెంట్స్‌ బిజినెస్‌ కోసం భారత్‌లోనే డేటా స్టోరేజ్‌ సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. భారత యూజర్ల లావాదేవీల డేటాను స్ధానికంగానే గ్లోబల్‌ పేమెంట్స్‌ కంపెనీలు ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ నొక్కిచెబుతున్న విషయం తెలిసిందే.

వాట్సాప్‌ నిర్ణయంతో తన డిజిటల్‌ చెల్లింపుల సేవలను పూర్తిస్ధాయిలో ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. వాట్సాప్‌ యూపీఐ ఆధారిత సేవలను ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి అందిస్తుందని ఈ సేవలు యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ వంటి పలు బ్యాంకుల ద్వారా అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. డేటా లోకలైజేషన్‌తో పాటు ఆడిట్‌ ప్రక్రియను వాట్సాప్‌ పూర్తిచేస్తోందని, ఆడిటర్స్‌ తమ నివేదికను సంబంధిత రెగ్యులేటర్‌కు సమర్పించిన అనంతరం పేమెంట్స్‌ అప్లికేషన్స్‌ను వాట్సాప్‌ ప్రారంభిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా ప్రస్తుతం పైలట్‌ మోడల్‌లో వాట్సాప్‌ పేమెంట్స్‌ లావాదేవీలుగా సాగుతున్నాయి. వాట్సాప్‌ పేమెంట్స్‌ను పూర్తిస్ధాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన లాంఛనాలను వేగంగా చేపడతున్నారు.

మరిన్ని వార్తలు