వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌

28 Feb, 2018 15:14 IST|Sakshi

వాట్సాప్‌లో కొంతమంది వ్యక్తులు స్పామ్‌ పోస్టులను పదే పదే పంపిస్తూ.. యూజర్లను విసుగెత్తిస్తూ ఉంటారు. అవి ఫార్వర్డో కాదో తెలుసుకోకుండా గ్రూప్స్‌లో పోస్ట్‌ చేస్తూ ఉంటారు. ఇలా భారీగా వచ్చే స్పామ్‌ సర్క్యూలేషన్‌ను నిరోధించడానికి వాట్సాప్‌ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతుంది. అదే ''ఫార్వర్డెడ్‌ మెసేజ్‌'' అనే ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా వేరే వ్యక్తులు స్పామ్‌ మెసేజ్‌ను ఫార్వర్డ్‌  చేసినా లేదా ఒకే చాట్‌ నుంచి ఆ పోస్టు ఫార్వర్డ్‌ అయినా 'ఫార్వర్డెడ్‌ మెసేజ్‌' అనే టాగ్‌ వచ్చేస్తోంది. ప్రస్తుతం వాట్సాప్‌, 25 సార్లు కంటే ఎక్కువ సార్లు ఫార్వర్డ్‌ అయితే కానీ మెసేజ్‌ను బ్లాక్‌ చేయలేదు. దీంతో స్పామ్‌ పోస్టులు విపరీతంగా ఫార్వర్డ్‌ అవుతూ ఉన్నాయి. 

వాట్సాప్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ఈ ఫీచర్‌ను స్పాట్‌ చేసింది. ఆండ్రాయిడ్‌ వీ2.18.67 వాట్సాప్‌ బీటాలో ఈ ఫీచర్‌ కనిపించింది. దీంతో పాటు స్టికర్స్‌ ఫీచర్‌ కూడా విండోస్‌ ఫోన్‌ బీటాపై స్పాట్‌ అయింది. ఆండ్రాయిడ్‌ బీటా యాప్‌కు కూడా ఇది అందుబాటులోకి వచ్చినట్టు తెలిసింది. వాట్సాప్‌ ఇటీవలే గ్రూప్‌ డిస్క్రిప్షన్‌ అనే ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌, విండోస్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూపులోని సభ్యులెవరైనా సరే గ్రూప్ డిస్క్రిప్షన్‌ను ఎడిట్ చేసే వెసులుబాటును  వాట్సాప్ కల్పించింది. 


 

మరిన్ని వార్తలు