వాట్సాప్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు..

17 Nov, 2017 16:42 IST|Sakshi

మెసేజింగ్‌ యాప్‌లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన వాట్సాప్‌ మరో రెండు కొత్త ఫీచర్లను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆ రెండు కొత్త ఫీచర్లపై పనిచేస్తుందని వాట్సాప్‌ బీటా వాచర్‌ డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్టు చేసింది. దీనిలో ఒకటి వాట్సాప్‌ కాల్‌ మధ్యలో ఉండగానే అటు వీడియో కాల్‌కు కానీ, ఇటు వాయస్‌ కాల్‌కు కానీ స్విచ్‌ అవొచ్చు. రెండోది మరింత తేలికగా వాయిస్‌ మెసేజ్‌ను రికార్డు చేయడం. ఈ రెండు ఫీచర్లు ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటాల్లో స్పాట్‌ అయి ఉన్నాయని తెలిసింది.  వీడియో-వాయిస్‌ కాల్‌ యాప్‌ స్విచ్‌, తొలుత జూలైలోనే టెస్టింగ్‌కు వచ్చింది. 

ఈ ఫీచర్‌ ద్వారా మాట్లాడుతున్న కాల్‌ను కట్ చేయకుండానే వీడియో కాల్‌ నుంచి వాయిస్‌ కాల్‌లోకి మారడం, వాయిస్‌ కాల్‌ నుంచి వీడియో కాల్‌లోకి మారడం చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను అంతర్గతంగా మాత్రమే టెస్ట్‌ చేయడం ప్రారంభించారని డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్టు చేసింది. అదేవిధంగా వాయిస్‌ మెసేజ్‌ బటన్‌ కోసం కూడా కొత్త కార్యాచరణను ప్రారంభించింది. యూజర్లు వాయిస్‌ మెసేజ్‌ను రికార్డు చేయడం ప్రారంభించిన అనంతరం ఓ టోగుల్‌ కనిపిస్తుంది. ఈ టోగుల్‌ ద్వారా వాయిస్‌ మెసేజ్‌ రికార్డింగ్‌ను లాక్‌చేయొచ్చు. దీంతో మెసేజ్‌ రికార్డు చేసేటప్పుడు యూజర్‌ తమ హ్యాండ్‌ను ఫ్రీగా ఉంచుకోవచ్చు. 

మరిన్ని వార్తలు