వాట్సాప్‌లో గోప్యతకు మరో ఫీచర్‌

7 Nov, 2019 12:17 IST|Sakshi

న్యూఢిల్లీ: యూజర్ల వివరాల గోప్యతకు సంబంధించి మెసేజింగ్‌ యాప్‌.. వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌ ప్రవేశపెట్టింది. దీనితో యూజరు అనుమతించిన వారు తప్ప మిగతావారెవరు సదరు యూజరు అనుమతి లేకుండా వారి పేర్లను గ్రూప్స్‌లో చేర్చే వీలుండదు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం యాప్‌లో ఉన్న ’నోబడీ’ ఆప్షన్‌ స్థానంలో ’మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌’ అనే ఆప్షన్‌ను వాట్సాప్‌ ప్రవేశపెట్టింది. దీనితో గ్రూప్స్‌లో తనను చేర్చేందుకు ఎవరెవరికి అనుమతి ఇవ్వొచ్చు, ఎవరికి ఇవ్వొద్దు అన్నది యూజరే నిర్ణయించుకోవచ్చని సంస్థ తెలిపింది. యూజరును నేరుగా గ్రూప్‌లో చేర్చేందుకు తమకు అనుమతి లేకపోతే వ్యక్తిగత చాటింగ్‌ ద్వారా గ్రూప్‌ అడ్మినిస్ట్రేటర్లు .. వారికి ప్రైవేటుగా ఆహ్వానం పంపాల్సి ఉంటుంది. దీనిపై యూజరు నిర్ణయం తీసుకోవచ్చు. పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా నిఘా పెట్టేందుకు దరిమిలా.. యూజర్ల వివరాల గోప్యత ప్రశ్నార్థకంగా మారిందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు