త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్‌

8 Jun, 2020 15:31 IST|Sakshi

యూజర్లకు సరికొత్త అనుభూతి

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా యూజర్లతో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌గా పేరొందిన వాట్సాప్‌ త్వరలో మరో ఐదు వినూత్న ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను లాంఛ్‌ చేసిన వాట్సాప్‌ గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాల్‌ పరిమితిని నలుగురి నుంచి ఎనిమిదికి పెంచి యూజర్లను ఆకట్టుకుంది. మల్టిపుల్‌ డివైజ్‌ సపోర్ట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్‌ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఒకే సమయంలో ఒక డివైజ్‌ కంటే పలు డివైజ్‌ల్లో తమ వాట్సాప్‌ ఖాతాలోకి యూజర్లు లాగిన్‌ అయ్యే వెసులుబాటు కలుగుతుంది. మరో నూతన ఫీచర్‌ క్యూఆర్‌ కోడ్‌పై వాట్పాప్‌ చురుకుగా పనిచేస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్‌ కేవలం క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా నూతన కాంటాక్ట్స్‌ను యాడ్‌ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్‌ ఇప్పటికే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై బీటా వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. ఇక వాట్సాప్‌ స్టోరీలు, స్టేటస్‌లు 24 గంటల్లో ఆటోమేటిగ్గా అదృశ్యమవుతున్న తరహాలో నిర్ధిష్ట సమయం కనిపించేలా సెల్ప్‌ డిస్ర్టక్టింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ త్వరలో లాంఛ్‌ చేయనుంది. డిలీట్‌ మెసేజెస్‌ ఆప్షన్‌తో త్వరలోనే ఈ ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇక ఇన్‌-యాప్‌ బ్రౌజర్‌ ఫీచర్‌పై మెసేజింగ్‌ యాప్‌ కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్లు తమకు చాట్స్‌లో వచ్చిన లింక్స్‌ను వెబ్‌ బ్రౌజర్‌కు రీడైరెక్ట్‌ చేయకుండానే నేరుగా ఓపెన్‌ అయ్యేలా ఈ ఫీచర్‌ వెసులుబాటు కల్పిస్తుంది. ఇక ఎంపిక చేసిన ఫ్రెండ్స్‌కు లాస్ట్‌ సీన్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌ ప్రస్తుతం తమ లాస్ట్‌ సీన్‌ స్టేటస్‌ను కాంటాక్ట్స్‌లో ప్రతిఒక్కరికీ అనుమతించడం లేదా ఏ ఒక్కరికీ అనుమతించకపోవడం అమలు చేస్తోంది. తాజా ఫీచర్‌తో ఎంపిక చేసిన ఫ్రెండ్స్‌తోనే లాస్ట్‌ సీన్‌ స్టేటస్‌ను పంచుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

చదవండి : గూగుల్‌ సెర్చ్‌లో వాట్సాప్‌ నెంబర్లు!

>
మరిన్ని వార్తలు