ప్రధాని మోదీ ఎందుకు అలా చేశారు?

27 Jun, 2017 14:15 IST|Sakshi


భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా హెచ్-1బీ వీసాల కొత్త నిబంధనలపై శుభవార్త వస్తుందని ఐటీ కంపెనీలు, ఐటీ నిపుణులు ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. శ్వేతాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇద్దరూ తొలిసారి ముఖాముఖిగా భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుకుని సంయుక్త సమావేశం కూడా నిర్వహించారు. కానీ ఈ సమావేశం భారతీయ వ్యాపారస్తులను, కంపెనీలకు, హెచ్-1బీ యూజర్లకు మాత్రం పెద్దగా ఆకర్షణీయంగా అనిపించలేదు. ముఖ్యంగా ప్రధాని వ్యవహరించిన తీరు నిరాశ కూడా కలిగించిందని విశ్లేషకులంటున్నారు. 
 
అమెరికా కంపెనీలకు వాణిజ్యమైన ఆటంకాలు తొలగించాలంటూ ట్రంప్ డైరెక్ట్ గా వారి డిమాండ్లను ప్రస్తావించినప్పటికీ, మన ప్రధాని మాత్రం భారతీయ ఐటీ నిపుణులు, కంపెనీలు హెచ్-1బీ వీసాతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇసుమంతైనా ఎత్తలేదని చెప్పారు. అంతేకాక వారి నుంచి డైరెక్ట్ డిమాండ్ వచ్చినప్పుడు, మనవాళ్లు మాత్రం మన సమస్యలను ఎత్తకపోవడం గోల్డెన్ ఛాన్స్ మిస్సైనట్టేనని విశ్లేషకులు చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన వనరుగా ఉన్న  ఐటీ రంగానికి  ఇది బాధకరమేనని పేర్కొంటున్నారు.. 
 
మోదీ-ట్రంప్ భేటీలో హెచ్-1బీ వీసా విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశం లేదని, ఒకవేళ వచ్చినా తమ దగ్గర సరియైన సమాధానమున్నాయంటూ మోదీ పర్యటనకు వెళ్లకముందే వైట్ హౌజ్ ఓ ప్రకటన చేసింది. కానీ మోదీ కచ్చితంగా ఈ విషయంపై ప్రస్తావించి, ఐటీ కంపెనీలకు కాస్త ఊరట కలిగించే వార్తను తెస్తారని తెగ ఆశలు పెట్టుకున్నారు. ఈ భేటీలో హెచ్-1బీ వీసాల సమస్యపై  ఓ క్లారిటీ రావచ్చని కూడా అంచనావేశారు. కానీ ఇప్పట్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వర్క్  వీసాలపై ట్రంప్ ప్రభుత్వం ఇటీవల తీసుకొస్తున్న ఆక్షలు ఎన్ఆర్ఐలకు కంటిమీదు కునుకు లేకుండా పోతుంది. విదేశీ వర్కర్లకు ట్రంప్ వ్యవహరించే విధానాలు కొత్తవేమీ కాదు. 
 
కానీ అత్యున్నత స్థాయి నేతల సమావేశంలో ఇలాంటి సమస్యను ప్రస్తావించడం వల్ల కాస్త ఊరట కలిగించే ప్రకటన వచ్చే అవకాశముంటుంది. కానీ ఇది మోదీ సరిగా సద్వినియోగం చేసుకోలేదని పలువురంటున్నారు.   
మరిన్ని వార్తలు