యస్‌ బ్యాంకు షేరు ఎందుకు కుప్పకూలింది?

19 Sep, 2019 15:56 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు యస్‌ బ్యాంకుకు మరోసారి భారీ అమ్మకాల సెగ తగిలింది.  దీంతో గురువారం 52 వారాల కనిస్టానికి పతనమైంది. ప్రధానంగా ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీకి చెందిన మార్పిడికి వీలుకాని డిబెంచర్ల(ఎన్‌సీడీల) రేటింగ్‌ను..కేర్‌ డౌన్‌గ్రేడ్‌ చేసిన వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. దీంతో ఆ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి.  ఫలితంగా అయిదు నెలల్లో ఎన్నడూ లేనంతగా అతిభారీ  పతనాన్ని నమోదు చేసింది.

ప్రమోటర్‌ గ్రూప్‌లోని మోర్గాన్‌ క్రెడిట్స్‌  రూ. 800 కోట్ల జారీ అనంతరం  ఎన్‌సీడీల  రేటింగ్‌ను ఏ- నుంచి కేర్‌ రేటింగ్స్‌ తాజాగా బీబీబీకు సవరించినట్లు యస్‌ బ్యాంక్‌ పేర్కొంది. యస్ బ్యాంక్‌లో మోర్గాన్‌ క్రెడిట్స్‌ 3.03 శాతం వాటాను కలిగి ఉంది. బ్యాంకు షేర్ల ధరలు పతనమైన నేపథ్యంలో ఎంసీపీఎల్‌, తదితర ప్రమోటర్ల వద్ద గల వాటా విలువ పడిపోవడంతో రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేపట్టినట్లు కేర్‌ రేటింగ్స్‌ తెలియజేసింది. ఈ నేపథ్యంలో  యస్‌ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో ఎన్‌ఎస్‌ఈలో 17 శాతం కుప్పకూలి రూ. 54 వద్ద ముగిసింది. 
 

మరిన్ని వార్తలు