ఈ-కామర్స్ పెట్టుబడులపై బియానీ కీలకవ్యాఖ్యలు

26 Jun, 2017 16:40 IST|Sakshi
ఈ-కామర్స్ పెట్టుబడులపై బియానీ కీలకవ్యాఖ్యలు
కోల్ కత్తా : ఫ్యూచర్ గ్రూప్ అధినేత, సీఈవో కిషోర్ బియానీ అందరికీ సుపరిచితమే. ఆఫ్ లైన్ రిటైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు.  ఆఫ్ లైన్ రిటైలర్లకు గట్టి పోటీగా నిలుస్తున్న ఆఫ్ లైన్ రిటైలర్లలో పెట్టుబడులపై ఆయన స్పందించిన తీరు చూస్తే, నిజంగా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఈ-కామర్స్ లో పెట్టుబడులు పెట్టాలనుకోవడం అత్యంత మూర్ఖమమైన నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. కనీసం రెండేళ్ల వరకు తాను ఈ-కామర్స్ రంగంలో పెట్టుబడులు పెట్టబోనని స్పష్టీకరించారు. ఆయన ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణాలున్నాయంట. ఈ గ్రూప్ ఇప్పటికే రూ.300 కోట్ల మేర నష్టాల్లో మునిగిపోయిందని, పరిశ్రమల మెగా ప్రకటనల వల్ల కంపెనీ భారీగా నష్టాలను చవిచూస్తున్నాయని తెలిసింది. 
 
కంపెనీ ఎక్కువ ఆదాయాలను ఆర్జించడానికి మొదటి నుంచి తమ సంప్రదాయ ఆదాయాల్లోనే వెచ్చిచూస్తూ వస్తోందని బియానీ చెప్పారు. ఆన్ లైన్ స్పేస్ లో పెట్టుబడులు అనేవి చాలా మూర్ఖమమని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతీయ ఈ-కామర్స్ ఇండస్ట్రీ రూ.2500 కోట్లతో ఉందని, కానీ అంతేమొత్తంలో నష్టాలు కూడా ఉన్నట్టు తెలిపారు. మొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆన్ లైన్ లో నగదును ఆర్జించిపెట్టడం లేదన్నారు. ఒకవేళ ఆన్ లైన్ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే,  కనీసం రెండేళ్ల బ్రేక్ తర్వాతనే దీని గురించి ఆలోచించాలని నిర్ణయించామని బియానీ చెప్పారు. 10 ఏళ్ల క్రితమే ఈ గ్రూప్ ఆన్ లైన్ లో తొలి వెంచర్ ప్రారంభించింది. అది ఫ్యూచర్ బజార్.కామ్. కానీ ప్రస్తుతం ఇది రూ.250 కోట్ల నష్టాల్లో ఉంది. ఇతర వెబ్ వెంచర్లు బిగ్ బజార్ డైరెక్ట్, ఫ్యాబ్ ఫర్నిష్ లు ఏకంగా మూత పడ్డాయి.   
 
ప్రస్తుతం తమ గ్రూప్ డిపార్ట్ మెంటల్ చైన్ బిజినెస్ లలో ప్రత్యర్థులు షాపర్స్ స్టాప్, లైఫ్ స్టయిళ్లను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుందని బియానీ చెప్పారు. కొత్తగా 15 సెంట్రల్ స్టోర్లను ఈ ఏడాది ఏర్పాటుచేయడానికి రూ.300 కోట్లను పెట్టుబడులుగా పెట్టాలనుకుంటున్నామని బియానీ తెలిపారు. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 50ని అధిగమిస్తుందన్నారు. తమ వృద్ధి రేటు కూడా 40 శాతం పెరుగుతుందని చెప్పారు.  జీఎస్టీ అమలుకు రిటైలర్లు సిద్ధంగా ఉన్నాయని, ప్యాక్డ్ ఫుడ్, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలు కిందకి దిగొస్తాయని పేర్కొన్నారు. 
మరిన్ని వార్తలు