కష్టకాలంలో విప్రో ఉద్యోగులకు తీపికబురు

6 Jun, 2017 08:55 IST|Sakshi
కష్టకాలంలో విప్రో ఉద్యోగులకు తీపికబురు
ఓ వైపు ఐటీ పరిశ్రమ గడ్డు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వ్యయాలు తగ్గించుకోవడానికి ఉద్యోగాల కోతను చేపడుతూ, వేతనాల ఇంక్రిమెంట్లను కంపెనీలు వాయిదావేస్తుంటాయి. కానీ టెక్ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెంచిన వేతనాలు ఈ నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.'' సగటున, ఆఫ్ షోర్ ఉద్యోగులకు మిడ్-సింగిల్ అంకెలలో ఇంక్రిమెంట్ ఉంటుందని చెప్పింది. అదేవిధంగా ఆన్ సైట్ ఉద్యోగులకు వారి వారి భౌగోళిక ప్రాంతాల బట్టి తక్కువ స్థాయి నుంచి మిడ్-సింగిల్ అంకెలలో ఇంక్రిమెంట్ ఉంటుందని పేర్కొంది. మంచి ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు వారి పరిహారాలను భారీగా పెంచుతూ రివార్డు ఇవ్వనున్నట్టు తెలిపింది. గతేడాది విప్రో ఆఫ్ షోర్ ఉద్యోగులకు సగటున 9.5 శాతం వేతనాన్ని పెంచింది.
 
ఆన్ సైట్ ఉద్యోగులకు 2 శాతం పెంపు చేపట్టింది. కానీ 2016-17 ఆర్థిక ఫలితాలను ప్రకటించిన విప్రో వార్షికంగా ఈ కంపెనీ 4.7 శాతం మేర పడిపోయిందని తెలిపింది. నాలుగో త్రైమాసికంలో ఐటీ సర్వీసుల రెవెన్యూలూ కూడా స్వల్పంగా పడిపోయాయి. సోమవారం తెలిసిన వివరాల్లో కంపెనీ చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ వేతనం కూడా భారీగా తగ్గినట్టు తెలిసింది. ఎలాంటి కమిషన్లను 2016-17లో అజిమ్ ప్రేమ్ అందుకోలేదు. మొత్తంగా ప్రేమ్ జీ వేతనం ముందటి ఆర్థిక సంవత్సరం కంటే 63 శాతం తగ్గి, రూ.79 లక్షలను మాత్రమే పొందారు. మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ  ఉద్యోగులకు వేతనాల ఇంక్రిమెంట్లను జూలై 1వరకు వాయిదావేస్తున్నట్టు అంతకముందే పేర్కొంది. 
>
మరిన్ని వార్తలు