కాంక్రీట్‌తోనే భవనానికి దృఢత్వం

9 Sep, 2015 00:17 IST|Sakshi
కాంక్రీట్‌తోనే భవనానికి దృఢత్వం

భారతి సిమెంట్ సీజీఎం మల్లారెడ్డి
తిరుచానూరు:
భవనం సుదీర్ఘకాలం దృఢంగా ఉండాలంటే నాణ్యమైన కాంక్రీట్ అవసరమని భారతి సిమెంట్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంసి.మల్లారెడ్డి చెప్పారు. నాణ్యమైన కాంక్రీట్ తయారీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్‌లో మంగళవారం రాత్రి సివిల్ ఇంజినీర్లు, డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ మంచి సిమెంటుతోనే నాణ్యమైన కాంక్రీటు తయారీ సాధ్యమన్నారు.

నాణ్యతలో రాజీ పడకుండా భారతి సిమెంటు అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని సొంతం చేసుకుందని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ ఐవి.రమణారెడ్డి భవన నిర్మాణానికి కాంక్రీటు తయారీలో మెళకువలను సూచించారు. కాంక్రీటు తయారీలో జల్లి, ఇసుక, కంకర ఎంత ముఖ్యమో నాణ్యమైన సిమెంటు అంతే ముఖ్యమని, లేకుంటే భవనం స్వల్ప కాలంలోనే కూలిపోయే స్థితికి చేరుకుంటుందని చెప్పారు. నాణ్యమైన కాంక్రీటు తయారీకి భారతి సిమెంటు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ రాయలసీమ ఏజీఎం ఎంఎన్.రెడ్డి, తిరుపతి బ్రాంచ్ సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ కె.మల్లికార్జున్‌రెడ్డి, టెక్నికల్ మేనేజర్ ఓబుల్‌రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ చాయాపతి, మార్కెటింగ్ ఆఫీసర్లు వెంకట్రామరెడ్డి, బాలకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు