మూడో వంతుకు మహిళా పైలట్లు: స్పైస్‌ జెట్‌

8 Mar, 2018 00:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘స్పైస్‌ జెట్‌’ తాజాగా మహిళా పైలట్ల కోసం రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ఆరంభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. మొత్తం పైలట్లలో మహిళల వాటాను మూడో వంతుకు పెంచుకోవాలని స్పైస్‌జెట్‌ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 800 మంది పైలెట్లు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య 140. బోయింగ్‌ 737, బొంబార్డియర్‌ క్యూ400 విమానాల కోసం మహిళా పైలట్లను నియమించుకుంటామని కంపెనీ తెలిపింది.

దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగుస్తుంది. ఇప్పటికే 175కు పైగా దరఖాస్తులు వచ్చాయని కంపెనీ పేర్కొంది. స్పైస్‌జెట్‌ యువ మహిళా కెప్టెన్లు కాబుల్‌ వంటి క్లిష్టమైన ఎయిర్‌ఫీల్డ్స్‌లోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నారని సంస్థ డైరెక్టర్‌ శివాని సింగ్‌ కొనియాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం పూర్తి మహిళా సిబ్బందితో ఉన్న మూడు ప్రత్యేక విమానాలను సంస్థ నడుపుతోంది.  

మరిన్ని వార్తలు