బిజ్‌బుక్‌

19 Jul, 2018 00:02 IST|Sakshi

పద్నాలుగేళ్ల క్రితం ఇంటర్నెట్‌లో ఆవిర్భవించిన ‘ఫేస్‌బుక్‌’.. ఒక శక్తిమంతమైన సమాచార వ్యవస్థగా అవతరించి కొత్త కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు ఊపిరిపోస్తోంది. ఈ క్రమంలోనే సాధారణ  మహిళలు సైతం ఫేస్‌బుక్‌ ద్వారా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆన్‌లైన్‌ ఆర్డర్లతో అభివృద్ధి పథంలోపయనిస్తున్నారు. అలాంటి కొందరు ఫేస్‌బుక్‌ మహిళా వ్యాపారుల స్ఫూర్తివంతమైన ముగ్గురి విజయగాథలివి. 

నలుగురికన్నా భిన్నంగా ఆలోచించడం, ఆధునీకరణ పోకడలను పసిగట్టడంతో నేటి మగువలు ఆగిపోవడం లేదు. సృజనాత్మకతను తమ చుట్టూ ఉన్నవారికే కాకుండా వేలాది మందికి చేరవేసే వేదికలను ఎంచుకుంటున్నారు. ఫేస్‌బుక్‌ వేదికగా తమ వ్యాపారాలను విస్తృతం చేసుకుంటున్నారు. వాటిలో చీరల జిలుగులు, ఆభరణాల వెలుగులు సందడిచేస్తుండగా, మరిన్ని క్రియేటివ్‌ అడుగులు ఫేస్‌బుక్‌లో పరుగులు తీస్తున్నాయి. ఫేస్‌బుక్‌లో బిజ్‌బుక్‌లు ఓపెన్‌ అవుతున్నాయి!

పెళ్లి పూలజడ
దేశ వ్యాప్తంగా 36 బ్రాంచ్‌లతో 200 మంది ఉద్యోగులతో ‘పెళ్లిపూలజడ’ ఫేస్‌బుక్‌ ట్రేడ్‌ విస్తరించింది. ఈ ఆన్‌లైన్‌ సంస్థ నిర్వాహకురాలు కల్పనా రాజేష్‌. కల్పన ఈ స్థాయిని చేరుకోవడానికి దాదాపు ఇరవై ఏళ్లు పట్టింది. అయితే ఫేస్‌బుక్‌లోకి వచ్చాక  గత ఆరేళ్లలోనే ఆమె గణనీయమైన అభివృద్ధిని సాధించారు. కల్పనా ఫ్లోరిస్ట్‌. అందులో కళాకృతులను ఆమె ఎక్కువ ఇష్టపడతారు. అదే ఆమెను ఫ్లోరల్‌ డెకరేషన్‌ నుంచి పెళ్లి కూతురు పూలజడ అలంకరణ వరకు తీసుకెళ్లింది. మొదట సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అయిన కల్పన ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు తన ఆసక్తిని పువ్వుల అలంకరణను కళగా కొనసాగించారు. అటు నుంచి ఒక సంస్థను స్థాపించే వైపుగా ఆమె అడుగులుపడ్డాయి. ఇందుకు ప్రధాన కారణం ఎక్కువ సమయం పిల్లలు, కుటుంబంతో గడపవచ్చు అనే ఆలోచన. తల్లి నుండి కొద్దిగా డబ్బు సాయం తీసుకొని నాణ్యతగల పూలను ఉపయోగిస్తూ పూల జడలను తయారుచేసి అమ్మడం ప్రారంభించారు. ఫేస్‌బుక్‌ పేజీని చురుకుగా ఉంచడం ఆమె విజయంలోని అతి ముఖ్య భాగం. తమ ఉత్పత్తులు ఇష్టపడిన వినియోగదారులను అదనంగా ఫొటోలను పంపించమంటారా అని అడుగుతారు. ఫేస్‌బుక్‌ పేజీలో పెళ్లిపూలజడల ఫొటోలను వధువులు, వారి స్నేహితులు, కుటుంబసభ్యులు అందరూ చూస్తారు. ఇదే ఆమె వ్యాపార వృద్ధికి తోడ్పడింది. 2012లో ఫేస్‌బుక్‌లో సంస్థ ప్రారంభం అయినప్పుడు కేవలం ముగ్గురు మాత్రమే ఉద్యోగులు ఉన్నారు. వారు కూడా ఇరుగుపొరుగువారే. తర్వాత ఇళ్లలో పనిచేసేవారి సాయం తీసుకున్నారు కల్పన. ఫేస్‌బుక్‌లోకి ఎప్పుడైతే వచ్చారో అప్పుడే ఆమె చాలా మంది వినియోగదారులకు కనెక్ట్‌ అయిపోయారు. ఆమె వర్క్‌ గురించి చాలా మందికి తెలిసింది. ఆర్డర్లు పెరిగాయి. దీంతో వ్యాపారం పెరిగింది. ఉద్యోగుల సంఖ్యా పెరిగింది.

కలర్‌ డి ఎర్త్‌
పన్నెండు ‘టెర్రకోటా’ (మట్టికళ) గ్రూపుల కళాకారులతో కలిసి ఆరు రాష్ట్రాలలో తనదైన సొంత శైలిని, సంస్కృతిని ‘కలర్‌ డి ఎర్త్‌’ ద్వారా పరిచయం చేస్తున్నారు హేమ బాలకృష్ణన్‌. మట్టితో ఎలాంటి అద్భుతాలను సృష్టించవచ్చో ‘కలర్‌ డి ఎర్త్‌’ ఫేస్‌బుక్‌ పేజీకి లాగిన్‌ అయ్యి తెలుసుకోవచ్చు. దాదాపు 200 మంది మహా కళాకారులు దేశవ్యాప్తంగా ‘కలర్‌ డి ఎర్త్‌’ ద్వారా ఉపాధి పొందుతున్నారు. హేమ ఇంటి వద్దనే ఉంటూ క్రియేటివ్‌ ఔట్‌లెట్స్‌ నుంచి ఆర్డర్స్‌ తీసుకుంటూ మహిళలకు చేయూతను అందిస్తున్నారు. ఇదంతా తనకు ఫేస్‌ బుక్‌ ద్వారా సులువుగా సాధ్యమైందంటారు ఆమె. మొదటిసారి హేమ అందమైన టెర్రకోట ఆభరణాన్ని తయారుచేసి కలర్‌ డి ఎర్త్‌ ట్యాగ్‌ వేసి బొటీక్‌లో ఉంచినప్పుడు దానిని చూసి ముచ్చటపడి చాలామంది కొనేందుకు ముందుకు వచ్చారు. ఆ తర్వాత వ్యాపారాన్ని ఇంటి బయటకు తీసుకెళ్లాలని భావించి చిన్న చిన్న రిటైల్‌ షాప్‌లను ప్రారంభించారు హేమ. ‘కలర్‌ డి ఎర్త్‌’ పేరిట 2013లో ఇ–కామర్స్‌ స్టోర్‌ని ప్రారంభించారు. దేశానికి ఆవలి కస్టమర్స్‌ని కూడా చేరేందుకు ఫేస్‌బుక్‌ ఒక మాధ్యమంగా ఏర్పరుచుకున్నారు.

స్టూడియో కాప్రే
కాప్రే  పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ పేజ్‌ను చూస్తే కళాత్మకతకు అద్దం పట్టే కాపర్‌ వస్తువుల ఫొటోలు మనకు దర్శనమిస్తాయి. ‘ది బ్యూటీ ఈజŒ  ఇన్‌ ది అన్‌ఫినిష్డ్‌’ ట్యాగ్‌తో ఈ పేజ్‌ ఆకర్షణీయమైన కాపర్‌ వస్తువుల ఫొటోలతో ఆకట్టుకుంటుంది. మహారాష్ట్రకు చెందిన సీమంతిని మిహిర్‌ ఈ ‘స్టూడియో కాప్రే’ సృష్టికర్త. 2012లో ఫేస్‌బుక్‌లో ఈ స్టూడియో ప్రారంభం అయింది. ఇండియాలోని కళాత్మక, సంప్రదాయ కుటుంబాలు హస్తకళా వస్తువులను ఇష్టపడుతుంటాయి. అయితే, ఇవి అన్ని చోట్లా అనువైన డిజైన్లు, ధరలలో లభించడం అసాధ్యం. మనోజ్‌ అనే కళాకారుడు రాగి, వెండి, బ్రాస్‌తో కళాత్మక వస్తువులను పాతికేళ్లుగా తయారుచేస్తున్నారు. అతను తన మామగారు, తాతగారు వద్ద ఈ కళను నేర్చుకున్నారు. సీమంతిని మిహిర్‌ మనోజ్‌తో కలిసి స్టూడియో కాప్రే స్టోర్‌ను ప్రారంభించారు. కాపర్‌ వస్తువుల కళను విస్తృతం చేయడానికి ఫేస్‌బుక్‌ ద్వారా వినియోగదారులు ఇంటరాక్ట్‌ అవడానికి శ్రద్ధపెట్టారు. దాంతో ఈ కళాత్మక వస్తువులకు చేరువయ్యేవారి సంఖ్య పెరిగింది. ‘మా కాప్రేస్‌ ఫేస్‌ బుక్‌ పేజ్‌కి వేలాది మంది అభిమానులు ఉన్నారు. ఫేస్‌బుక్‌ లేకుండా ఇంత చిన్న బిజినెస్‌ అంతమందికి చేరువ అవడం అసాధ్యం’ అంటారు మిహిర్‌.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌ బ్యాటరీ, బడ్జెట్‌ ధర : రియల్‌మి సీ 2

అద్భుతమైన రియల్‌మి 3 ప్రొ వచ్చేసింది

స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో మారుతి కొత్త బాలెనో

రెడ్‌మికి షాక్‌: రియల్‌మి 3 ప్రొ నేడే లాంచింగ్‌

రూపాయి 47పైసలు పతనం

నష్టాల్లో మార్కెట్లు : బ్యాంకులు బేర్‌

ఆర్థికంగా వెలిగిపోదాం!

సేవింగ్స్‌ ఖాతాలు రెండు చాలు!!

ఏడాది పెట్టుబడుల కోసం...

భారత్‌ పన్నుల రాజేమీ కాదు

జెట్‌కు ఐబీసీ వెలుపలే పరిష్కారం

క్యూ4 ఫలితాలతో దిశానిర్దేశం

ఒక స్మార్ట్‌ఫోన్‌ రీఫండ్‌ అడిగితే..10 ఫోన్లు

స్పైస్‌ జెట్‌ చొరవ : 500 మందికి ఊరట  

భారత్‌లో బిలియన్‌ డాలర్ల పెట్టుబడి

రీట్స్‌ ద్వారా సీపీఎస్‌ఈ స్థలాల విక్రయం!

అమెజాన్, గూగుల్‌ దోస్తీ

జెట్‌ను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలి

వినోదంలో యాప్‌లే ‘టాప్‌’

ఆ ఉద్యోగులను ఆదుకుంటాం..

మా బిడ్డలు ఆకలితో చచ్చిపోతే..బాధ్యులెవరు?

నిమిషానికో ఫోన్‌ విక్రయం

విరాట్‌ కోహ్లీ మెచ్చిన ఆట..

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌10 శ్రేణిపై ఆఫర్లు

ఫిబ్రవరిలో జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌దే హవా

రిలయన్స్‌ ‘రికార్డ్‌’ లాభం

జెట్‌కు త్వరలోనే కొత్త ఇన్వెస్టర్‌!

ఆన్‌లైన్‌ రిటైల్‌... ఆకాశమే హద్దు!!

భారీ ఉద్యోగాల ‘డెలివరీ’!!

పడకేసిన ‘జెట్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్రిషతో అలా కనెక్ట్‌ అయ్యారు

శంకర్‌@25 ఆనందలహరి

క్రేజీ కాంబినేషన్‌ కుదిరింది

డైలాగ్‌ చెప్పండి.. కేజీయఫ్‌2లో నటించండి

ప్లీజ్‌.. అలాంటివి చేయొద్దు: లారెన్స్‌

జననం