వాణిజ్య వివాదాలపై అమెరికాతో చర్చలు: మంత్రి సురేష్‌ ప్రభు

29 Oct, 2018 01:55 IST|Sakshi

న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలను పరిష్కరించుకునే దిశగా భారత్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్‌ ప్రభు చెప్పారు. ఇందుకు సంబంధించి అమెరికా చేసిన ఆఫర్‌కు ప్రతిగా భారత్‌ మరో ప్రతిపాదన చేసినట్లు ఆయన వివరించారు.

భారత్‌ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే.  దీంతో ప్రతిగా అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, ఉక్కు, ఇనుము వంటి సుమారు 29 ఉత్పత్తులపై సుంకాలను నవంబర్‌ 2 నుంచి పెంచనున్నట్లు భారత్‌ ప్రకటించింది. అయితే, తాజాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వాయిదా వేసిన నేపథ్యంలో మంత్రి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు